అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Feb 26 2017 12:26 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
కర్నూలు: కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన బోయ శ్రీరంగం గోవిందు(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ఫైనాన్స్‌లో ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇసుక తోలుకుంటూ జీవనం సాగించేవాడు. సకాలంలో కంతులు చెల్లించలేకపోవడంతో 15 రోజుల క్రితం ఫైనాన్స్ నిర్వాహకులు ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. దీంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని కలత చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య రాణి, ఇద్దరు సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement