ఉద్యోగాల్లో మహిళలకు సరైన ప్రాతినథ్యం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతో కంపెనీల్లో అవగాహన మొదలై కొన్నేళ్లుగా వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రావడంలేదు. దాంతో కంపెనీలు కొత్త పంథా ఎంచుకుంటున్నాయి.
తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హైదరాబాద్‌లో పూర్తి మహిళా సిబ్బందితో మైత్రేయి పేరిట బ్రాంచీని ఏర్పాటు చేసింది. ఇందులో గృహ, ఎస్‌ఎంఈ రుణాలు మొదలైనవి అందిస్తామని సంస్థ హెచ్‌ఆర్ హెడ్ ప్రనిత్ సోనీ తెలిపారు.
ఇదీ చదవండి: సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే..
ఉద్యోగాల్లో మహిళలకు కూడా సమానమైన అవకాశాలను కల్పించాలన్న తమ లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని ఎండీ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. ప్రతి మైత్రేయి శాఖలో 7–15 మంది ఉద్యోగినులు ఉంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment