Piramal Enterprises
-
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‌వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా..
ఉద్యోగాల్లో మహిళలకు సరైన ప్రాతినథ్యం లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాంతో కంపెనీల్లో అవగాహన మొదలై కొన్నేళ్లుగా వారి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రావడంలేదు. దాంతో కంపెనీలు కొత్త పంథా ఎంచుకుంటున్నాయి. తాజాగా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హైదరాబాద్‌లో పూర్తి మహిళా సిబ్బందితో మైత్రేయి పేరిట బ్రాంచీని ఏర్పాటు చేసింది. ఇందులో గృహ, ఎస్ఎంఈ రుణాలు మొదలైనవి అందిస్తామని సంస్థ హెచ్ఆర్ హెడ్ ప్రనిత్ సోనీ తెలిపారు. ఇదీ చదవండి: సంప్రదాయంగా ఉండక్కర్లేదు.. ఎందుకంటే.. ఉద్యోగాల్లో మహిళలకు కూడా సమానమైన అవకాశాలను కల్పించాలన్న తమ లక్ష్యానికి ఇది తోడ్పడుతుందని ఎండీ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. ప్రతి మైత్రేయి శాఖలో 7–15 మంది ఉద్యోగినులు ఉంటారని వివరించారు. -
ఏఐఎఫ్‌ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
రెట్టింపు ఏయూఎంపై పిరమల్ ఎంటర్ప్రైజెస్ దృష్టి
ముంబై: ఇన్వెస్టర్ డే సందర్భంగా పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) తమ దీర్ఘకాలిక వృద్ధి, లాభదాయకత ప్రణాళికలను ఆవిష్కరించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి తమ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని (ఏయూఎం) రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకుంది. అప్పటికల్లా ఏయూఎంను రూ. 1.2–1.3 లక్షల కోట్లకు చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. తమ రిటైల్ వ్యాపారంలో హోల్‌సేల్ విభాగం వాటాను 33 శాతానికి, రిటైల్ విభాగం వాటాను 67 శాతానికి పెంచుకోవడం ద్వారా దీన్ని సాధించే యోచనలో ఉన్నట్లు వివరించింది. అటు 2024 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పీఈఎల్ రిటైల్ రుణాల వ్యాపారం 57 శాతం పెరిగి రూ. 34,891 కోట్లకు చేరింది. జూన్ ఆఖరు నాటికి కంపెనీకి 423 శాఖలు, 33 లక్షల పైచిలుకు కస్టమర్లు, సుమారు 13 రకాల రుణ సాధనాలు ఉన్నాయి. -
శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి పిరమల్ ఔట్
ముంబై: యూఎస్ పీఈ దిగ్గజం టీపీజీ తదుపరి తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయాన్ని చేపట్టింది. ఓపెన్ మార్కెట్ ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్‌లో గల మొత్తం 8.34 శాతం వాటాను పిరమల్ విక్రయించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్, బ్లాక్‌రాక్, బీఎన్పీ పరిబాస్, సొసైటీ జనరాలి తదితర సంస్థలకు 3.12 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 1,545 ధరలో రూ. 4,824 కోట్లకు వాటాను ఆఫర్ చేసింది. సోమవారం శ్రీరామ్ ఫైనాన్స్‌లో 2.65% వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,390 కోట్లకు టీపీజీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేశాయి. కాగా.. బ్లాక్‌డీల్ వా ర్తల ప్రభావంతో బుధవారం ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనా న్స్ షేరు 11.3% దూసుకెళ్లి రూ. 1,736 వద్ద నిలిచింది. ఇక మంగళవారం 6% జంప్‌చేసి రూ. 838కు చేరి న పిరమల్ ఎంటర్ప్రైజెస్ బుధవారం మరింత అధికంగా 14.2% దూసుకెళ్లి రూ.958 వద్ద ముగిసింది. పునర్వ్యవస్థీకరణతో శ్రీరామ్ గ్రూప్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ తదుపరి పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు గ్రూప్‌లోని పలు కంపెనీలలో షేర్లు లభించాయి. ఈ బాటలో శ్రీరామ్ ఫైనాన్స్‌లో 8.34 శాతం వాటాను పొందగా.. శ్రీరామ్ జీఐ హోల్డింగ్స్, ఎల్ఐ హోల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌లోనూ 20 శాతం చొప్పున వాటాలు లభించాయి. దీంతో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 13.33 శాతం, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 14.91 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
రియల్టీలో పిరమల్ గ్రూప్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పిరమల్ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ పిరమల్ రియల్టీ వచ్చే రెండేళ్లలో రూ.3,500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న నాలుగు రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు పిరమల్ రియల్టీ సీఈవో గౌరవ్ సాహ్నే తెలిపారు. ‘ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో ప్రస్తుతం 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ములంద్, థానే, మహాలక్ష్మి, బైకులా వద్ద గృహ సముదాయాలు నిర్మితమవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులకుగాను 12,000 యూనిట్ల అపార్ట్మెంట్స్ రానున్నాయి. తొలి 1,000 యూనిట్లు కస్టమర్లకు అందించడం ప్రారంభం అయింది’ అని తెలిపారు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ హౌసింగ్ డిమాండ్ బలంగానే ఉందని గౌరవ్ వివరించారు. ఉమ్మడిగా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భూ యజమానులతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నామన్నారు. -
రిలయన్స్ క్యాపిటల్ ప్రణాళికకు డెడ్‌లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్‌ను (ఆర్సీఎల్) కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల సంస్థలు తగు పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు గడువును రుణదాతలు ఆగస్టు 28 వరకూ పొడిగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విలువ మదింపు కోసం మరింత సమయం కావాలంటూ బిడ్డర్లు కోరడంతో డెడ్‌లైన్‌ను పొడిగించడం ఇది అయిదోసారని పేర్కొన్నాయి. గడువు ఆగస్టు 10తో ముగియాల్సి ఉంది. బరిలో ఉన్న పిరమల్, టోరెంట్ సంస్థలు సెప్టెంబర్ 30 వరకూ సమయం ఇవ్వాలని కోరగా రుణదాతల కమిటీ (సీవోసీ) తిరస్కరించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఆగస్టు 30 వరకూ గడువు కోరింది. వాస్తవానికి పరిష్కార ప్రణాళిక సమర్పించేందుకు మే 26 అసలు డెడ్‌లైన్. అప్పటి నుంచి దాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో పాటు గవర్నెన్స్‌పరంగా లోపాలు ఉండటంతో గతేడాది నవంబర్ 29న ఆర్సీఎల్ బోర్డును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసి అడ్మినిస్ట్రేటరును నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ విక్రయానికి అడ్మినిస్ట్రేటర్ బిడ్లను ఆహ్వానించారు. -
అంబానీ ఆస్తులపై అదానీ కన్ను !?
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కంపెనీని చేజిక్కించుకునేందుకు అదానీ ఫిన్సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ తదితర 14 దిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకి వీలుగా బిడ్స్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నియమిత పాలనాధికారి ఈ నెల 25వరకూ గడువు పెంచారు. తొలుత ఇందుకు మార్చి 11చివరి తేదీగా ప్రకటించారు. చెల్లింపుల్లో వైఫల్యం, కార్పొరేట్ పాలనా సంబంధ సమస్యల నేపథ్యంలో గతేడాది నవంబర్ 29న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ బోర్డును రద్దు చేసింది. 2021 సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన ఏజీఎంలో కన్సాలిడేటెడ్ రుణ భారం రూ. 40,000 కోట్లుగా వాటాదారులకు తెలియజేసింది. మూడో పెద్ద కంపెనీ ఇటీవల ఆర్బీఐ దివాలా చట్ట చర్యల(ఐబీసీ)కు ఉపక్రమించిన మూడో పెద్ద నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా రిలయన్స్ క్యాప్ నిలుస్తోంది. ఇప్పటికే ఐబీసీ పరిధిలోకి చేరిన సంస్థల జాబితాలో శ్రేయీ గ్రూప్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్ఎఫ్ఎల్) చేరిన విషయం విదితమే. కాగా.. రిలయన్స్ క్యాప్ కొనుగోలు పట్ల ఆసక్తి కలిగిన కంపెనీలు బిడ్స్ దాఖలుకు మరింత గడువును కోరడంతో పాలనాధికారి తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రేసులో ఇప్పటికే ఆర్ప్ వుడ్, వర్దే పార్టనర్స్, మల్టిపుల్స్ ఫండ్, నిప్పన్ లైఫ్, జేసీ ఫ్లవర్స్, బ్రూక్‌ఫీల్డ్, ఓక్ట్రీ, అపోలో గ్లోబల్, బ్లాక్‌స్టోన్, హీరో ఫిన్‌కార్స్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిలో చాలవరకూ కంపెనీ పూర్తి కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. కొనుగోలుదారులకు రెండు అవకాశాలు కొనుగోలుదారులకు రెండు అవకాశాలున్నాయి. కంపెనీకున్న 8 అనుబంధ సంస్థల కోసం లేదా మొత్తం రిలయన్స్ క్యాపిటల్‌ను సొంతం చేసుకునేందుకు ఈవోఐలు దాఖలు చేయవచ్చు. అనుబంధ సంస్థల జాబితాలలో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ సెక్యూరిటీస్, రిలయన్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ తదితరాలున్నాయి. దివాలా చర్యలలో భాగంగా వై.నాగేశ్వరరావును ఆర్బీఐ పాలనాధికారిగా నియమించింది. -
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
పిరమల్ గ్రూప్ చేతికి డీహెచ్ఎఫ్ఎల్
ముంబై: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఎన్సీఎల్టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. డీహెచ్ఎఫ్ఎల్ రుణదాతలకు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. రుణ పరిష్కారంలో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్‌దారులతోపాటు.. రుణదాతలు మొత్తం రూ. 38,000 కోట్లు రికవర్ చేసుకున్నట్లు వివరించింది. నగదు, మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్) సుమారు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. రిజల్యూషన్‌లో భాగంగా డీహెచ్ఎఫ్ఎల్ వద్దగల మరో రూ. 3,800 కోట్లను రుణదాతలు పొందగలిగినట్లు తెలియజేసింది. ఐబీసీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ సరీ్వసుల రంగంలో విజయవంతమైన తొలి రుణ పరిష్కార ప్రణాళికగా డీహెచ్ఎఫ్ఎల్ను పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. ఇకపై రిజల్యూషన్లకు ఇది నమూనాగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలను(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్, డీహెచ్ఎఫ్ఎల్) విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. విలీన సంస్థను పిరమల్ క్యాపిటల్ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు. -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్‌లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
పిరమల్ ఫార్మాలో 20% వాటా విక్రయం
హెల్త్‌కేర్ విభాగం పిరమల్ ఫార్మాలో యూఎస్ సంస్థ కార్లయిల్ గ్రూప్ 20 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. డీల్ అంచనా విలువను 49 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3700 కోట్లు)గా వెల్లడించింది. ఇందుకు కార్లయిల్ గ్రూప్‌నకు చెందిన సీఏ క్లోవర్ ఇంటర్మిడయట్ 2 ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. నికర రుణం, మారకపు రేటు, పనితీరు వంటి అంశాల ఆధారంగా డీల్‌కు తుది ధరను నిర్ణయించనున్నట్ల అజయ్ పిరమల్ గ్రూప్ కంపెనీ వివరించింది. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు నామమాత్ర లాభంతో రూ. 1344 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1370 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1317 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో వారాంతాన ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేరు 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అంతా కొనుగోలుదారులేతప్ప అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 13.10 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. 18 త్రైమాసికాల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలను సాధించిన నేపథ్యంలో గురువారం సైతం ఈ కౌంటర్ 10 శాతం దూసుకెళ్లింది. టర్న్అరౌండ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐవోబీ రూ. 144 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1985 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడంతో లాభదాయకత మెరుగైనట్లు నిపుణులు తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 3.6 శాతం పెరిగి రూ. 1532 కోట్లను తాకగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4502 కోట్ల నుంచి రూ. 1479 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 21.97 శాతం నుంచి 14.78 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు సైతం 10.81 శాతం నుంచి సగానికి క్షీణించి 5.44 శాతానికి చేరాయి. -
ఐదు పబ్లిక్ ఇష్యూలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా మరో పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీరాం క్యాపిటల్‌లో 20% వాటాను కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 2,014 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించిం ది. తద్వారా ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో విస్తరించేందుకు వీలు చిక్కుతుందని కంపెనీ చైర్మన్ అజయ్ పిరమల్ చెప్పారు. శ్రీరాం క్యాపిటల్‌తో భాగస్వామ్యం ద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూరుతుందన్నారు. గత నాలుగు దశాబ్దాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారానే కంపెనీ వృద్ధి బాటలో సాగిందని శ్రీరాం గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్.త్యాగరాజన్ పేర్కొన్నారు. దీంతో తమ ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ భారీ వృద్ధిని అందుకుంటుందని తెలిపారు. గ్రూప్‌లోని శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూని యన్ ఫైనాన్స్ సంస్థలకు హోల్డింగ్ కంపెనీగా శ్రీరాం క్యాపిటల్ వ్యవహరిస్తోంది. గతేడాదిలో కూడా పిరమల్ శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌లో 9.9% వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 1,636 కోట్లను చెల్లించింది. కాగా, ఈ నెల మొదట్లో వొడాఫోన్ ఇండియాలోగల 11% వాటాను యూకే మాతృ సంస్థ వొడాఫోన్‌కు రూ. 8,900 కోట్లకు విక్రయించింది. బీఎస్ఈలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు 1% లాభంతో రూ. 602 వద్ద నిలవగా, శ్రీరాం సిటీ యూనియన్ 1% బలపడి రూ. 1,215 వద్ద, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ షేరు 3% ఎగసి రూ. 747 వద్ద ముగిశాయి.