![Piramal Group acquires DHFL for total consideration of Rs 34,250 cr - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/30/PIRAMAL-DHFL.jpg.webp?itok=P5oRlOOV)
ముంబై: ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుని ఎన్‌సీఎల్‌టీకి చేరిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణదాతలకు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు తెలియజేసింది. రుణ పరిష్కారంలో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులతోపాటు.. రుణదాతలు మొత్తం రూ. 38,000 కోట్లు రికవర్ చేసుకున్నట్లు వివరించింది. నగదు, మారి్పడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్) సుమారు రూ. 34,250 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది.
రిజల్యూషన్‌లో భాగంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ వద్దగల మరో రూ. 3,800 కోట్లను రుణదాతలు పొందగలిగినట్లు తెలియజేసింది. ఐబీసీ నిబంధనల ప్రకారం ఫైనాన్షియల్ సరీ్వసుల రంగంలో విజయవంతమైన తొలి రుణ పరిష్కార ప్రణాళికగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. ఇకపై రిజల్యూషన్లకు ఇది నమూనాగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. రెండు కంపెనీలను(పీసీహెచ్‌ఎఫ్‌ఎల్, డీహెచ్‌ఎఫ్‌ఎల్) విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. విలీన సంస్థను పిరమల్ క్యాపిటల్ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment