
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ మంగళవారం కంపెనీ చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా 'మహేష్ రాజారామన్'ను నియమించినట్లు ప్రకటించింది. మల్లికా మిట్టల్ తన పదవికి రాజీనామాను చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
సీఆర్ఓగా 5 సంవత్సరాల కాలానికి నియమితులైన రాజారామన్, బ్యాంకింగ్ రంగంలో 29 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉన్నారు. టీమ్‌ను ముందుకు నడిపించడంలో అనుభవం ఉందని.. సంస్థ ఈయన సారథ్యంలో మరింత అభివృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది.
రాజారామన్ యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, ఏఎన్‌జెడ్ గ్రైండ్‌లేస్ బ్యాంక్ వంటి వివిధ బ్యాంకులతో అనుబంధం కలిగి ఉన్నారు. ఈయన 2024 ఆగష్టు 1నుంచి చీఫ్ రిస్క్ ఆఫీసర్ (CRO)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment