హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మహీంద్రా ఫైనాన్స్ అనుబంధ సంస్థ ‘మహీంద్రా అసెట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ’ మార్కెట్లోకి ఉన్నతి ఎమర్జింగ్ బిజినెస్ యోజన పేరిట సరికొత్త ఫండ్ పథకాన్ని విడుదల చేసింది. జనవరి 8 నుంచి 22 వరకూ ఈ పథకం అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.500. బుధవారమిక్కడ ఫండ్ స్కీమ్‌ను విడుదల చేసిన సందర్భంగా మహీంద్రా ఏఎంసీ సీఈఓ అండ్ ఎండీ అశుతోష్ బిష్ణోయి మాట్లాడుతూ.. మహీంద్రా ఏఎంసీని ప్రారంభించిన 18 నెలల్లోనే 300 నగరాల్లో రూ.1,000 కోట్లు సమీకరించామని తెలియజేశారు. ప్రస్తుతం మూడు ఫండ్ పథకాలున్నాయని.. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మరో 3–4 ఫండ్లను తీసుకొస్తామని మొత్తంగా వచ్చే ఐదేళ్లలో 20 స్కీంలకు చేరాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియజేశారు.
‘‘గత ఐదేళ్ళుగా మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో మిడ్ క్యాప్స్ వస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం. అందుకే ఉన్నతి యోజన పథకం కోసం 35–40 మిడ్‌క్యాప్ కంపెనీలను గుర్తించాం. వీటిలో 65 శాతం పెట్టుబడులను పెడతాం’’ అని వివరించారు. మిడ్‌క్యాప్‌ల జోరు కేవలం మన దేశంలోనే కాకుండా చైనా, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ వంటి దేశాల మార్కెట్లోనూ ఉందని తెలియజేశారు. ‘‘అలాగని ప్రతి మిడ్‌క్యాప్‌లోనూ పెట్టుబడి పెట్టకూడదు. కన్సూ్యమర్ డ్యూరబుల్స్, ఆటో, హోమ్ డెకర్, బీఎఫ్‌ఎస్‌ఐ విభాగాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నాం’’ అని తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ హెడ్ వీఎం కార్తికేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.
మహీంద్రా కొత్త ఫండ్ ‘ఉన్నతి యోజన’
Published Thu, Dec 28 2017 1:00 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment