అమరావతి, సాక్షి: ‘‘అవునా.. అలా కనిపించడం లేదా?. అయినాసరే రూ. 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్లు ఎలాగైనా లెక్కలు చూపించండి’’.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులకు జారీ చేసిన ఆదేశాలివి!. శ్వేత పత్రాల పేరిట జగన్ పాలనను ఏదో ఒకరకంగా తప్పుబట్టాలని చూస్తున్న చంద్రబాబు.. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలిచ్చారని స్పష్టమవుతోంది.
గత ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని రంగాలపై వరుసగా చంద్రబాబు ప్రభుత్వం వైట్ పేపర్లు విడుదల చేస్తోంది. అమరావతి, ఆ వెంటనే విద్యుత్ శాఖపై లేనిపోని లెక్కలు చెబుతూ స్వయంగా చంద్రబాబు ఆ పత్రాలు విడదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై అధికారులతో సమీకక్షించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. రాష్ట్రానికున్న అప్పుల లెక్కలపై చంద్రబాబు ఆరా తీశారు. అయితే..
ఇదీ చదవండి: అన్నన్న చంద్రన్నా.. పచ్చి అబద్ధాలతో విద్యుత్ శ్వేత పత్రం!
ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో ఉన్న ఆయన.. ఎలాగైనా 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నట్టు చూపాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్టు సమాచారం. ఈ సమావేశం కంటే ముందే.. అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా రూ. 14 లక్షలు కోట్లు ఉన్నాయంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వ లెక్కలు, రిజర్వ్ బ్యాంకు గణాంకాలకు విరుద్ధంగా అప్పుల లెక్క చూపలేక అధికారులు అవస్థలు పడుతోంది.
ఇదీ చదవండి: శ్వేత పత్రం కాదది.. ‘పచ్చ’ పత్రం
Comments
Please login to add a commentAdd a comment