
న్యూఢిల్లీ: దేశీ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ ప్రపంచంలోనే అ త్యంత పటిష్టమైన బీమా సంస్థగా నిల్చింది. 2024 సంవత్సరానికి సంబంధించి బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం స్థిరంగా 9.8 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో, 88.3 బ్రాండ్ పటిష్టత సూచీ స్కోరుతో, ట్రిపుల్ ఏ రేటింగ్‌తో ఎల్‌ఐసీ అగ్రస్థానంలో ఉంది. క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ రెండో స్థానంలో ఉంది.
ఈ సంస్థ బ్రాండ్ విలువ 9% పెరిగి 4.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్ 1.3 బిలియన్ డాలర్ల విలువతో (82% వృద్ధి) మూడో స్థానంలో ఉన్నట్లు బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ తెలిపింది. మరోవైపు, విలువపరంగా చూస్తే చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. 33.6 బిలియన్ డాలర్లతో పింగ్ ఆన్ సంస్థ అగ్రస్థానంలో ఉండగా, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే సీపీఐసీ వరుసగా 3వ, 5వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment