ఎల్‌ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక | Lic Dhan Vriddhi Withdrawn On April 1, 2024 | Sakshi
Sakshi News home page

పాలసీ దారులకు అలెర్ట్‌!.. ఈ పాలసీని ఉపసంహరించిన ఎల్‌ఐసీ

Published Wed, May 22 2024 1:54 PM | Last Updated on Wed, May 22 2024 2:01 PM

Lic Dhan Vriddhi Withdrawn On April 1, 2024

లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ (ఎల్‌ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్‌ లింక్డ్‌, నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఇండివిజువల్‌ సేవింగ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ధన్‌ వృద్దిని విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఎల్‌ఐసీ ప్రకటించింది.

ఈ సేవింగ్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్‌ను  అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.

ఈతరుణంలో ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.  

ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల  
• సింగిల్ ప్రీమియం ప్లాన్
• పాలసీ టర్మ్, డెత్ కవర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. 
• పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. 
•ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.  
• మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్
• మెచ్యూరిటీపై ఇన్‌స్టాల్‌మెంట్, సెటిల్‌మెంట్‌లో డెత్ బెనిఫిట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
• పాలసీకి లోన్ అందుబాటులో ఉంది

ఎల్‌ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్
• ఎల్‌ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది.  
• ఎల్‌ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్
• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. 
• జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే..  నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement