
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంట్లో మృతదేహం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఎర్రగుంట్ల మండలానికి చెందిన ఐసీఎంల్ రిటైర్డ్ ఉద్యోగి వెంకట రమణయ్య (60) స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండేవారు. అయితే గత ఐదు రోజులుగా ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణలో భాగంగా బుధవారం రోజున ముసలయ్య ఇంట్లో సోదాలు నిర్వహించగా వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. దీంతో మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్యను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా వెంకటరమణను మొదట కిడ్నాప్ చేసి తర్వాత హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సూర్యనారాయణ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. చదవండి: టీడీపీ దౌర్జన్యం.. ఎమ్మెల్యేతో కలిసి ఫిర్యాదు..
Comments
Please login to add a commentAdd a comment