బీఎస్‌ఎన్‌ఎల్ అంతర్జాతీయ వైఫై సేవలు ప్రారంభం
బీఎస్‌ఎన్‌ఎల్ అంతర్జాతీయ వైఫై సేవలను ఆ సంస్థ హెచ్‌ఆర్ ఫైనాన్స్ డైరెక్టర్ సుజాత టి రాయ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్ టాటా కమ్యూనికేషన్ తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా సుమారు వంద దేశాల్లో 44 మిలియన్ వైఫై హట్‌స్పాట్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ రోమింగ్ లేకుండా మొబైల్ వినియోగదారులకు వైఫై సేవలు వర్తిస్తాయన్నారు.
ఈ సేవలకు సంబంధించిన ప్యాకేజ్ లను ప్రకటించారు. ఏడు రోజుల కాల పరిమితి గల రూ.999 వోచర్, 15 రోజులు కాలపరిమితి గల రూ.1599, 30 రోజుల కాలపరిమితి గల రూ. 1999 వోచర్స్‌కు హై స్పీడ్‌లో అన్ లిమిటెడ్ డాటా వినియోగించవచ్చన్నారు. మై బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్ ద్వారా డెబిట్, క్రెడిట్, ఇంటర్‌నేట్ బ్యాంకింగ్ వినియోగించి ప్యాకేజిలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎంటీ ఎల్ అనంతరామ్,ఎన్‌ఎటీఎఫ్‌ఎం సీజీఎం జాన్ థామస్‌లు పాల్గొన్నారు.