న్యూయార్క్: నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతుంటే బాధపడుతుంటాం. నాలుగు వెంట్రుకలు పోతుంటే బట్టతల వస్తుందని భయాందోళన చెందుతుంటారు. ఇక చివరకు తలపై వెంట్రుకలన్నీ ఊడి ముందు భాగమంతా గుండుగా కనిపిస్తుంటే జనాల్లో వెళ్లేందుకు జంకుతుంటారు. బట్టతల అనేది ఓ వ్యాధి కాదు. వాతావరణం ప్రభావం.. నీటి కాలుష్యం.. ప్రోటీన్స్ లోపం వంటి వాటితో బట్టతల వస్తుంది. ఇక అవివాహితులకు బట్టతల వస్తే ఇక తమకు పెళ్లి కాదని తెగ ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారందరిలో మార్పు కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తున్నారు. బట్టతల శాపం కాదు.. అదృష్టం అని చాటిచెప్పేలా అమెరికాలోని న్యూయార్క్‌లో అతి పెద్ద ఉత్సవం జరుగుతోంది. ఈ ఉత్సవానికి కేవలం బట్టతల ఉంటే చాలు. ఆ వివరాలు తెలుసుకోండి.
చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి తండ్రి అరెస్ట్
బట్టతల ఉన్న వారందరి కోసం అమెరికా రాపర్ రమి ఈవెన్ ఎష్ ‘బట్టతల ఉత్సవం’ న్యూయార్క్‌లో నిర్వహించడం మొదలుపెట్టాడు. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవాళ్లంతా ఈ ఉత్సవానికి అర్హులు. బ్రూక్లిన్‌లోని రుబులాడ్ క్లబ్‌లో జరిగే వేడుకకు 18 డాలర్లు చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. బట్టతల లేకుంటే ఉత్సవానికి అనుమతించరు. ఫ్యాషన్ వీక్ ఫెస్ట్‌కు పోటీగా బట్టతల ఫెస్ట్‌ను నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవంలో బట్టతలతో బాధపడొద్దని చెబుతారు. బట్టతల ఉన్నా దర్జాగా బతకవచ్చని అవగాహన కల్పిస్తారు. పైగా బట్టతలను ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో వివరిస్తారు. అనంతరం అందరూ ఫ్యాషన్ షో చేస్తారు. అమెరికాలో 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మహిళలు బట్టతల బాధపడుతున్నట్లు ఆ దేశ ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ పేర్కొంది.
చదవండి: జైలు మరుగుదొడ్డిలో సొరంగం.. ‘జులాయి’ సినిమాలో మాదిరి
Comments
Please login to add a commentAdd a comment