బట్టతల దాచి పెళ్లి: భర్తకు షాకిచ్చిన భార్య! | Viral: Woman Seeks Divorce From Her Bald Husband In UP | Sakshi
Sakshi News home page

బట్టతల దాచి పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య!

Published Fri, Mar 5 2021 3:47 PM | Last Updated on Fri, Mar 5 2021 6:50 PM

Viral: Woman Seeks Divorce From Her Bald Husband In UP - Sakshi

పెళ్లికి ముందు అందరూ ఎదో ఒక తప్పు పని చేసే ఉంటారు. వేరే వ్యక్తిని ప్రేమించి ఉండటం, చెడు అలవాట్లకు దగ్గరవడం. అయితే పెళ్లి సమయం వచ్చేసరికి కాబోయే భార్య, భర్త దగ్గర ఇలాంటి విషయాలను దాచిపెట్టేస్తుంటాం. కానీ వివాహం అనంతరం ఎదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అచ్చం ఇలాగే ఉంటుంది. ఇక్కడ చెప్పబోయే మహిళకు కేవలం అబద్దం చెప్పాడనే సంగతి తెలిసింది. ఇంకేముంది అది పెద్దదా చిన్నదా అనే విషయాన్ని పక్కనపెట్టి రచ్చకెక్కింది. పెండ్లికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నదన్న విషయం దాచినందుకు ఏకంగా అతనికి విడాకులిచ్చేందుకు సిద్ధమమైంది సదరు భార్య. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో వెలుగుచూసింది.

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2020 జనవరిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే సరిగ్గా ఏడాడికి అతడికి బట్టతల ఉన్న విషయం భార్యకు తెలిసింది. దీంతో పెళ్లి సమయంలో జుట్టు ఒత్తుగానే ఉంది కదా. ఇప్పుడిలా జుట్టు ఊడిపోయిందేంటని భార్తను ప్రశ్నించింది. దీంతో అతడు తనకు ముందు నుంచే బట్టతల ఉందని అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లిలో విగ్గు పెట్టుకుని కవర్‌ చేశానని చెప్పాడు. ఇది విన్న మహిళకు చిరాకెత్తింది. భర్త తనను మోసం చేశాడని అతని నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. 

తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఈ విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని పేర్కొన్నారు. తన ఫ్రెండ్స్ ముందు అవమానానికి గురయ్యానని, కాబట్టి తనకు విడాకులు కావాల్సిందేనని కోరింది. అయితే, ఆమెకు నచ్చజెప్పేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారు. కౌన్సెలింగ్ జరుగుతోంది.  మొదటి విడుత కౌన్సెలింగ్ పూర్తయింది. రెండో విడుత కౌన్సెలింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు.

చదవండి: బట్టతల బెంగా.. పరిష్కారాలు ఇవిగో..!

‘విగ్గు’ మొగుడు నాకొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement