
సాక్షి, సినిమా : పాడ్‌మన్ చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లుక్కు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల నుంచి బట్టతల అవతారంలోనే ఈ స్టార్ హీరో కనిపిస్తున్నాడు. దీంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కృత్రిమ జుట్టు కోసం చేయించుకున్న ఆపరేషన్ వికటించిందని.. అందులో ఇలా బట్టతలతోనే కొనసాగాలని అక్షయ్ నిర్ణయించుకున్నాడని... కొన్నాళ్ల క్రితం ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక కథనం వెలువరించింది. అయితే అదంతా రూమర్ అని అక్కీ ఖండించాడు. తాజాగా ఓ టీవీషోలో ఆయన మాట్లాడుతూ అసలు విషయాన్ని వెల్లడించాడు. ‘‘కేసరి చ్రితంలో పాత్ర కోసం తలపై పెద్ద పాగా ధరించాల్సిన అవసరం ఉంది. అది ఇబ్బందికరంగా ఉండటంతోనే ఇలాంటి హెయిర్ స్టైల్ కొనసాగిస్తున్నా.. అంతేతప్ప వేరే కారణం ఏదీ లేదు’’ అని అక్షయ్ స్పష్టత ఇచ్చేశాడు.
1897లో జరిగిన సారాఘరి యుద్ధ నేపథ్యంలో కేసరి చిత్రం తెరకెక్కుతోంది. బ్రిటీష్ ఆర్మీలో ఉన్న సిక్కు సైనికులకు, పశ్తున్ ఒరక్‌జై తెగల మధ్య ఈ యుద్ధం జరిగింది. కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2019 హోలీకి కేసరి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment