సినిమాల్లో ‘గుండు’ కలిసొస్తుందా?, సక్సెస్‌ రేటెంత? | Shivaji To Jawan Heroes Bald Look Got Huge Response | Sakshi
Sakshi News home page

సినిమాల్లో కలిసొస్తున్న ‘గుండు’.. ఇప్పుడిదే ట్రెండ్‌

Published Fri, Sep 8 2023 5:23 PM | Last Updated on Fri, Sep 8 2023 6:21 PM

Shivaji To Jawan Heroes Bald Look Got Huge Response - Sakshi

ఒకప్పుడు హీరో అంటే.. 6 అడుగల హైట్‌..మంచి హెయిర్‌ స్టయిల్‌, డ్రెసింగ్ కచ్చితంగా ఉండాలి. అభిమానులు కూడా తమ హీరోలో ఈ క్వాలిటీస్‌ కచ్చితంగా ఉండాలని కోరుకునే వారు. కానీ ఇప్పుడు అవేవి పట్టించుకోవడం లేదు. గుండుతో కనిపించినా సరే.. తమను అలరిస్తే బా‘గుండు’ను అంటున్నారు. అందుకే ఈ మధ్య స్టార్‌ హీరోలే గుండుతో బాక్సాఫీస్‌ డీ కొడుతున్నారు. సినిమా సక్సెస్‌లోనూ ‘గుండు’ కీలక పాత్ర పోషిస్తోంది.

షారుఖ్‌ సాహసం
షారుఖ్ హెయిర్‌  స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి.  దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే మొదలు మొన్నటి పఠాన్‌ వరకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన హెయిర్‌ స్టైల్‌తో అభిమానులను అలరించాడు. అలాంటి షారుఖ్‌.. ‘జవాన్‌’ కోసం పెద్ద సాహసమే చేశాడు. తొలిసారి గుండుతో కనిపించి షాకిచ్చాడు. జవాన్‌లో కీలకమైన మెట్రో ట్రైన్‌ హైజాక్‌ సీన్‌లో షారుఖ్‌ గుండుతో దర్శనమించాడు. తెరపై గుండుతో షారుఖ్‌ కనిపించగానే అభిమానులు ఈలలు వేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది.

గుండుతో ధనుష్‌ ఢీ
ధనుష్‌ తన 50వ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో గుండుతో కనిపించబోతున్నాడు. ఇది గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అట. ధనుష్, విష్ణు విశాల్, ఎస్‌జే సూర్య అన్నదమ్ములుగా కనిపిస్తారని టాక్‌. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంతో ధనుష్‌ గుండుతోనే విలన‍్లను ఢీకొడుతాడట. 

గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్‌
మోహన్‌లాల్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘బర్రోజ్‌’. వాస్కో డి గామా నిధిని రక్షించడానికి నియమించబడిన 400 ఏళ్ల నాటి ఆత్మ కథ బర్రోజ్‌. ఈ చిత్రానికి మోహన్‌లాలే దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రం. ఇందులో గుండు, గుబురు గడ్డంతో మోహన్‌లాల్‌ కనిపించబోతున్నాడు. 

బాస్‌..గుండూ బాస్‌
మెగాస్టార్‌ చిరంజీవి వెండితెరపై ఇప్పటి వరకు గుండుతో కనిపంచలేదు. అయితే భోళాశంకర్‌ కోసం గుండులో కనిపిస్తాడని అంతా భావించారు. ఎందుకంటే చిరంజీవియే స్వయంగా ఈ విషయాన్ని చెబుతూ..అప్పట్లో ఓ వీడియో వదిలాడు. అందులో చిరు..జుట్టు తీయించకుండా ప్రొస్టేటిక్‌ మేకప్‌తో గుండు లుక్‌ని మౌల్డ్‌ చేయించుకున్నాడు. అయితే సినిమాలో మాత్రం ఆ లుక్‌లో కనిపంచలేదు. 

కలిసొచ్చిన ‘గుండు’
చిత్ర పరిశ్రమలో ‘గుండు’ సక్సెస్‌ రేటు ఎక్కువనే చెప్పాలి. స్టార్‌ హీరోలు గుండుతో కనిపించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి. శివాజీ చిత్రంలో రజనీకాంత్‌ గుండుతో సరికొత్త లుక్‌లో కనిపించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘గజనీ’ సినిమాలో సూర్య  గుండుతో కనిపించారు. అదీ సూపర్‌ హిట్టే. ఇదే సినిమా హిందీ రీమేక్‌లో అమీర్‌ గుండుతో కనిపించాడు. అభయ్‌ చిత్రంలో కమల్‌ హాసన్‌ కూడా గుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మోహన్‌ బాబు శివశంకర్‌ చిత్రంతో గుండుతో కనిపించగా.. ఆ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. వర్సటైల్ యాక్టర్ విక్రమ్ 'సేతు' సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు గుండు చేయించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement