ఓటీటీలోనూ అదరగొడుతున్న జవాన్‌.. కేవలం 10 రోజుల్లోనే.. | Jawan Movie Gets 25 Million Streaming Hours In 10 Days | Sakshi
Sakshi News home page

Jawan: మరో రికార్డు సాధించిన జవాన్‌.. ఓటీటీలో తగ్గడం లేదుగా!

Published Thu, Nov 16 2023 10:42 AM | Last Updated on Thu, Nov 16 2023 11:02 AM

Jawan Movie Gets 25 Million Streaming Hours In 10 Days - Sakshi

ఓటీటీలో కొత్త సినిమా రిలీజైందంటే చాలు ఎగబడి మరీ చూస్తారు. అందులోనూ స్టార్‌ హీరో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు చూసి సంతృప్తి చెందుతారు. థియేటర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన స్టార్‌ హీరో మూవీ ఓటీటీలో వస్తే ఇంకే రేంజ్‌లో ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జవాన్‌. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్‌ చేసిన ఈ యాక్షన్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రెండు నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. నవంబర్‌ 2న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన చిత్రం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ సునామీ సృష్టిస్తోంది. ఓటీటీలో రిలీజై 14 రోజులు కావస్తున్నా ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 చిత్రాల్లో తొలి స్థానంలో ఉంటూ సత్తా చాటుతోంది. ఇండియాలోనే కాకుండా, శ్రీలంక, మాల్దీవులు సహా మరో నాలుగు దేశాల్లోనూ జవాన్‌ను ఎగబడి మరీ చూస్తున్నారు.

కేవలం పది రోజుల్లోనే ఈ చిత్రం 25 మిలియన్‌ వాచ్‌ హవర్స్‌ సాధించింది. తక్కువ సమయంలో అత్యధికంగా వీక్షించిన సినిమాగా జవాన్‌ అరుదైన రికార్డు సృష్టించింది. దీంతో ఓటీటీలోనూ జవాన్‌ క్రేజ్‌ ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి: ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement