వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఓ పాన్ ఇండియా సినిమాకు ఓ చిన్న సినిమా గట్టి పోటీనిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో దక్షిణాది తారలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీయే. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2న రిలీజ్ అయింది.
అప్పుడే ఓటీటీ రిలీజైన మ్యాడ్
ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ సినిమా నిత్యం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్‌లో చోటు దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఝలక్ ఇస్తోంది చిన్న చిత్రం మ్యాడ్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపీక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్‌లో హిట్ అయిన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అటు జవాన్, ఇటు మ్యాడ్‌ను ఓటీటీ ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు.
టాప్ 10 చిత్రాల్లో మ్యాడ్ ఏ స్థానంలో ఉందంటే?
ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువమంది చూస్తున్న టాప్ 10 చిత్రాల్లో జవాన్ హిందీ వర్షన్ తొలి స్థానంలో నిలబడి తన ఆధిక్యతను చాటుకుంటోంది. కానీ తమిళ, తెలుగు వర్షన్లను మాత్రం మ్యాడ్ మూవీ వెనక్కు నెట్టేసింది. ఎక్కువమంది చూస్తున్న సినిమాల్లో మ్యాడ్ రెండో స్థానంలో నిలబడింది. జవాన్ తమిళ వర్షన్ మూడో స్థానంలో, తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో నిలిచాయి డ్రీమ్ గర్ల్ 2.. ఐదో స్థానంలో ఉంది. చంద్రముఖి 2 పదో స్థానంలో ఊగిసలాడుతోంది. ఇది ఆదివారం నాటి లెక్కలు.. ఇది చూసిన అభిమానులు ఒక చిన్న తెలుగు సినిమా.. భారీ బడ్జెట్ మూవీ జవాన్‌కు గట్టి పోటీనే ఇస్తుందే అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన మెగా ఇంటి కోడలు.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment