Jawan Film OTT Rights: ఓటీటీకి జవాన్‌.. కళ్లు చెదిరే ధరకు హక్కులు! | Shah Rukh Khans Jawan Film Sold To Netflix For A Whopping RS 250 Crore - Sakshi
Sakshi News home page

Jawan Film OTT Rights: జవాన్‌ ఓటీటీ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా!

Sep 12 2023 7:27 PM | Updated on Sep 12 2023 7:55 PM

Shah Rukh Khans Film Sold To Netflix For A Whopping RS 250 Crore - Sakshi

బాలీవుడ్‌ బాద్‌ షా తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీలో లేడీ సూపర్‌స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్రలో మెరిసింగది. ఈనెల 7న బాక్సాఫీస్ బరిలో నిలిచిన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఏడు నెలల గ్యాప్‌లోనే.. పఠాన్ చిత్రం తర్వాత మరో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇదే ఊపు కొనసాగితే పఠాన్ వసూళ్లను దాటేసే ‍అవకాశముంది. కాగా.. తమిళ డైరెక్టర్‌ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

(ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!)

అయితే ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి మరో జాక్‌పాట్‌ తగిలింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ కోసం ఏకంగా రూ.250 కోట్లు మేకర్స్‌కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. స్ట్రీమింగ్ తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి థియేటర్లలో లభిస్తున్న రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో  విజయ్ సేతుపతి  విలన్  పాత్రలో కనిపించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో నటించింది.

(ఇది చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్‌' రికార్డ్‌.. కోట్లు కొల్లగొట్టిన షారుక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement