Shahrukh Khan Jawan Sealed the Big Deal for its OTT And Satellite Rights - Sakshi
Sakshi News home page

Sharukh Khan Jawan: రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Sep 25 2022 4:22 PM | Updated on Sep 25 2022 5:56 PM

Sharukh Khan Jawan sealed the Big Deal for its OTT And Satellite rights - Sakshi

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను జీ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. 

(చదవండి: Shahrukh And Salman Khan: ఒకే సినిమాలో ఖాన్‌ త్రయం !.. సౌత్‌ డైరెక్టర్‌తో చిత్రం)

 సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులే షాకింగ్ ధర పలికినట్లు సమాచారం. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్‌.. శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జీ దాదాపు రూ.250 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్‌కు జంటగా నయనతార నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement