ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా? | MAD Movie OTT Release Date And Streaming Details | Sakshi
Sakshi News home page

MAD Movie OTT: యూత్‌ఫుల్ కామెడీ సినిమా.. ఓటీటీ రిలీజ్‌కి రెడీ!

Oct 27 2023 4:24 PM | Updated on Oct 27 2023 4:32 PM

MAD Movie OTT Release Date And Streaming Details - Sakshi

ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన సినిమాలు పడటం లేదు. పలువురు యంగ్ హీరోలు.. కొత్త మూవీస్‌తో వచ్చినా సరే అనుకున్నంత రేంజులో హిట్స్ అయితే కొట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి ఓటీటీలపై పడుతోంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కొత్త మూవీస్ ఏం వస్తున్నాయా? వాటిని ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఓ తెలుగు కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఏ సినిమా?
తెలుగులో కామెడీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించిన సందర్భాలు తక్కువ. అలా అక్టోబరు తొలివారంలో అంటే 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'మ్యాడ్' చిత్రం.. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కథ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ చూస్తున్నంతసేపు నవ్వుకునేలా చేసింది. హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇప్పుడీ సినిమానే ఓటీటీలోకి రాబోతుందట.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)

ఓటీటీలోకి ఎప్పుడు?
'మ్యాడ్' ఓటీటీ హక్కుల్ని.. థియేటర్లలో విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ఓటీటీలో చాలావరకు సినిమాలన్నీ నెలరోజుల్లోనే కాస్త అటుఇటుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు 'మ్యాడ్' చిత్రాన్ని కూడా నవంబరు 3న ఓటీటీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సో అదన్నమాట విషయం.

'మ్యాడ్' కథేంటి?
మనోజ్, అశోక్, దామోదర్ ముగ్గురు ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్. వీళ్ల ముగ్గురికి మూడు లవ్ స్టోరీలు. అయితే వీళ్లు ఫ్రెండ్స్‌గా కలిసిన విధానం, వాళ్లకు ఏర్పడ్డ ప్రేమలు, హాస్టల్‌లో ర్యాగింగ్ సీన్స్.. ఇలా అన్నీ సరదాగా సాగిపోతుంటుంది. మరి ఈ కథలో చివరకు ఏమైంది? అనేది స్టోరీ.

(ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement