‘పట్ట’లేని ఆనందం.. | Japanese Restaurant Offers Discount to Bald Men | Sakshi
Sakshi News home page

‘పట్ట’లేని ఆనందం..

Published Thu, May 15 2014 3:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:01 PM

‘పట్ట’లేని ఆనందం.. - Sakshi

‘పట్ట’లేని ఆనందం..

బట్ట తల వచ్చేస్తుందని దిగులు చెం దేవారు.. జపాన్‌లోని అకాసకా డిస్ట్రిక్ట్‌లో ఉన్న ‘ఒటాసుకే’ రెస్టారెంట్‌కు వెళ్తే.. ‘పట్ట’లేని ఆనందం వారి సొంతమవుతుంది. ఎందుకంటే.. ఈ పబ్ కమ్ రెస్టారెంట్లో పట్ట బుర్ర ఉన్నవారికి బిల్లులో డిస్కౌంట్ ఇస్తారు. ఎంత ఎక్కువ మంది గ్రూప్‌గా వస్తే.. డిస్కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు.. ఈ రెస్టారెంట్లో ‘‘బట్ట తలను చూసి గర్విం చండి’’ అని రాసి కూడా ఉంటుంది. ఈ నెల్లోనే ప్రారంభమైన ‘ఒటాసుకే’ అప్పు డే టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పని ఒత్తిడితో జుట్టు రాలిపోతూ.. బట్ట తల వచ్చేవారి సంఖ్య జపాన్‌లో పెరిగిపోతోందట. కుటుంబం కోసం విపరీతంగా శ్రమిస్తూ.. ఒత్తిడితో బట్ట తల తెచ్చేసుకుంటున్న ఇలాంటివారి కోసం.. వారికి మద్దతుగా ఈ రెస్టారెంట్ యజమాని యోషికా ఈ వినూత్న డిస్కౌంట్ పథకం పెట్టారట. అంతేకాదు.. ఈ రెస్టారెంట్ లాభాల్లో కొంత మొత్తాన్ని సునామీ పీడిత ప్రాంతాల పున ర్ నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement