ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ వీరికి సోకుంది వారికి సోకదు అనేది మనం చెప్పలేం. పిల్లల నుంచి పండు ముదసలి వరకు కరోనా సోకిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బట్టతల ఉన్న మగవారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్లోస్.
కరోనాతో మరణించిన వారిపై బ్రౌన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ కార్లోస్ పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో చనిపోయిన వారి డేటాను పరిశీలించగా కరోనా మరణాలు బట్టతల ఎక్కువగా ఉన్న వారివేనని తేలింది. బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందనే అంశంపై ప్రొఫెసర్ కార్లోస్ మాట్లాడుతూ, బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో హార్మోన్ల ప్రభావమేనని తెలిపారు. లైఫ్ స్టైల్, స్మోకింగ్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, శృంగార సమస్యల వల్ల మగవారిలో టెస్టో స్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉందని, ఆ హార్మోనే కరోనా వైరస్, కణాలతో పోరాడే శక్తిని ఇస్తుందని తెలిపారు. మరోవైపు కార్లోస్ బృందం స్పెయిన్ దేశంలో జరిపిన పరిశోధనల్లో కూడా బట్టతల ఉన్నవారికే ఎక్కువగా కరోనా సోకినట్లు తెలింది. (పాక్లో లక్షకు చేరువలో కరోనా కేసులు)
ఇదిలా ఉండగా స్త్రీల కంటే మగవారే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి అసలు కారణం ఏంటంటే...
1. కరోనా వైరస్ మన శరీరంలో వ్యాపించడానికి ఎసీఈ2 అనే హార్మోన్ అవసరం. అయితే ఈ ప్రోటీన్ మగవారిలో ఎక్కువగా ఉంటుందని, అందుకే వారి శరీరంలో ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇక మగవారితో పోలిస్తే ఎసీఈ2 ప్రొటీన్ ఆడవారిలో తక్కువ ఉంటుంది.
2. కరోనా మగవారికే ఎక్కువగా సోకడానికి కారణం సిగరెట్లు తాగే అలవాటు ఉండటం. ఆడవారితో పోలిస్తే సిగరెట్లు తాగే అలవాటు మగవారిలో ఎక్కువగా ఉంటుంది. సిగరెట్లు పొగ ఊపిరితిత్తులలో ఏసీఈ2ను ఎక్కువగా చేస్తోంది.
3. మగవారి క్రోమోజోమ్లలలో ఎక్స్ కారకం ఒకటే ఉంటుంది. ఈ క్రోమోజోమ్ కణాలలో కరోనాను ఎదుర్కొనే రోగనిరోథకత ఉంటుంది. ఆడవారిలో రెండు ఎక్స్ కారకాలు ఉండటం వలన వారికి రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది.
4. ఇక మగవారికే కరోనా ఎక్కువగా సోకడానికి కారణం వారిలో పరిశుభ్రత తక్కువగా ఉండటమే కరోనా వ్యాపించకుండా ఉండటానికి చేతులను కడుక్కోవడం, శానిటైజర్లను వాడటం, పరిశుభ్రతను పాటించడం అత్యవసరం. ఇవన్నీ పాటించడంలో మగవారు వెనుకబడి ఉండటం కూడా వారిలో కరోనా వ్యాప్తికి కారణం. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..)
Comments
Please login to add a commentAdd a comment