harmons
-
స్త్రీల కంటే మగవారికే కరోనా ముప్పు!
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు లక్షల మందిని బలితీసుకున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ వీరికి సోకుంది వారికి సోకదు అనేది మనం చెప్పలేం. పిల్లల నుంచి పండు ముదసలి వరకు కరోనా సోకిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా బట్టతల ఉన్న మగవారికి కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందా? అంటే అవుననే అంటున్నారు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్లోస్. కరోనాతో మరణించిన వారిపై బ్రౌన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ కార్లోస్ పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. మరోవైపు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో చనిపోయిన వారి డేటాను పరిశీలించగా కరోనా మరణాలు బట్టతల ఎక్కువగా ఉన్న వారివేనని తేలింది. బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందనే అంశంపై ప్రొఫెసర్ కార్లోస్ మాట్లాడుతూ, బట్టతల ఉన్న మగవారికి కరోనా ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం వారిలో హార్మోన్ల ప్రభావమేనని తెలిపారు. లైఫ్ స్టైల్, స్మోకింగ్, రోగనిరోధక వ్యవస్థ పనితీరు, శృంగార సమస్యల వల్ల మగవారిలో టెస్టో స్టెరాన్ అనే హార్మోన్ తక్కువగా ఉందని, ఆ హార్మోనే కరోనా వైరస్, కణాలతో పోరాడే శక్తిని ఇస్తుందని తెలిపారు. మరోవైపు కార్లోస్ బృందం స్పెయిన్ దేశంలో జరిపిన పరిశోధనల్లో కూడా బట్టతల ఉన్నవారికే ఎక్కువగా కరోనా సోకినట్లు తెలింది. (పాక్‌లో లక్షకు చేరువలో కరోనా కేసులు) ఇదిలా ఉండగా స్త్రీల కంటే మగవారే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. దీనికి అసలు కారణం ఏంటంటే... 1. కరోనా వైరస్ మన శరీరంలో వ్యాపించడానికి ఎసీఈ2 అనే హార్మోన్ అవసరం. అయితే ఈ ప్రోటీన్ మగవారిలో ఎక్కువగా ఉంటుందని, అందుకే వారి శరీరంలో ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. ఇక మగవారితో పోలిస్తే ఎసీఈ2 ప్రొటీన్ ఆడవారిలో తక్కువ ఉంటుంది. 2. కరోనా మగవారికే ఎక్కువగా సోకడానికి కారణం సిగరెట్లు తాగే అలవాటు ఉండటం. ఆడవారితో పోలిస్తే సిగరెట్లు తాగే అలవాటు మగవారిలో ఎక్కువగా ఉంటుంది. సిగరెట్లు పొగ ఊపిరితిత్తులలో ఏసీఈ2ను ఎక్కువగా చేస్తోంది. 3. మగవారి క్రోమోజోమ్లలలో ఎక్స్ కారకం ఒకటే ఉంటుంది. ఈ క్రోమోజోమ్ కణాలలో కరోనాను ఎదుర్కొనే రోగనిరోథకత ఉంటుంది. ఆడవారిలో రెండు ఎక్స్ కారకాలు ఉండటం వలన వారికి రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. 4. ఇక మగవారికే కరోనా ఎక్కువగా సోకడానికి కారణం వారిలో పరిశుభ్రత తక్కువగా ఉండటమే కరోనా వ్యాపించకుండా ఉండటానికి చేతులను కడుక్కోవడం, శానిటైజర్లను వాడటం, పరిశుభ్రతను పాటించడం అత్యవసరం. ఇవన్నీ పాటించడంలో మగవారు వెనుకబడి ఉండటం కూడా వారిలో కరోనా వ్యాప్తికి కారణం. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) -
హార్మోన్ల బ్యాలెన్స్‌కు ఇలా తినండి
పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు చాలా ఎక్కువ. వారిలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు నిత్యం అనేక హార్మోను స్రవిస్తుంటాయి. వాటి మధ్య ఏమాత్రం సమతౌల్యత తప్పినా ఎన్నో సమస్యలు వస్తాయి. పైగా వాటిని సరిచేయడానికి మరికొన్ని హార్మోన్లను పైనుంచి ఇస్తే మిగతావి కూడా బ్యాలెన్స్ తప్పే అవకాశాలూ ఉండవచ్చు. మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత వల్ల యాంగై్జటీ, త్వరగా కోపం రావడం, త్వరత్వరగా మూడ్స్ మారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించడం చాలా సాధారణం. తాము రోజూ తీసుకునే ఆహారంతోనే మహిళలు తమకు కావలసిన హార్మోన్లను తగిన పాళ్లలో పొందడం ఎలాగో తెలుసుకోండి. అందుకు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి... ప్రోజెస్టెరాన్: గర్భధారణకు, మెనోపాజ్ సమయంతో పాటు మహిళల సంపూర్ణారోగ్యానికీ ఉపయోగపడే హార్మోన్ ఇది. ఈ హార్మోన్ లోపిస్తే బరువు పెరగడం, పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సినవి: విటమిన్ బి6, పీచు, జింక్, మెగ్నీషియమ్ ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ హార్మోన్ స్వాభావికంగానే సమకూరుతుంది. ఇందుకోసం చిక్కుళ్లు (బీన్స్), బ్రోకలీ, క్యాబేజీ, కాలిఫ్లవర్, గుమ్మడి, పాలకూర, నట్స్ వంటివి తీసుకోవాలి. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎఫ్ఎస్హెచ్): ఇది కూడా మహిళల్లో చాలా కీలకమైన హార్మోన్. మహిళల్లో మెనోపాజ్ వయసు దగ్గర పడుతున్నకొద్దీ దీని స్రావాలు ఎక్కువ. థైరాయిడ్: థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లు ఎంతగా అవసరమో అందరికీ తెలిసిందే. దీని మోతాదు కాస్త ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మహిళలతో పాటు పురుషులకు అవసరమైన హార్మోన్లను కూడా థైరాయిడ్ గ్రంథి స్రవిస్తుంది. తీసుకోవాల్సినవి: ఎఫ్ఎస్హెచ్ కోసం, థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేయడానికి ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చేపలు (సాల్మన్, సార్డిన్, కొరమీను వంటివి), అవిశగింజలు, వాల్నట్, కిడ్నీబీన్స్, పాలకూర వంటి ఆకుకూరల్లో ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం పైన పేర్కొన్న హార్మోన్లనే గాక... హైపో పిట్యుటరిజమ్, హైపోగొనాడిజమ్ వంటి హార్మోనుల అసమతౌల్యతను ఏర్పరచే కండిషన్లను కూడా నివారిస్తాయి. ల్యూటినైజింగ్ హార్మోన్ (ఎల్‌హెచ్): ఇది కూడా మహిళలకు అవసరమైన చాలా ప్రధానమైన హార్మోన్. పురుషుల్లో కూడా కొద్దిపాళ్లలో అవసరమే. ఇది మహిళల్లో అవసరమైన ఇతర హార్మోన్లను స్రవించేలా చేస్తుంది. తీసుకోవాల్సినవి: ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ లభ్యమయ్యే ప్రధాన ఆహారాలను తీసుకోవడం ద్వారా దీన్ని స్వాభావికంగానే పొందవచ్చు. వాటితోపాటు పొట్టుతీయని గింజధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పప్పుధాన్యాలు (పల్సెస్)తీసుకోవడం ద్వారా ఎల్‌హెచ్‌ను స్వాభావికంగా పొందవచ్చు. టెస్టోస్టెరాన్: ఈ హార్మోన్ ప్రధానంగా పురుషులకు అవసరమైనది. అయితే కొద్దిపాళ్లలో మహిళల్లోనూ ఇది అవసరం. మహిళల్లో ఎముకలు, కండరాల బలం కోసం, కొవ్వు సమంగా విస్తరించడంతో పాటు రక్తకణాల ఉత్పత్తి కోసం ఈ హార్మోన్ అవసరం. తీసుకోవాల్సినవి: ఇది జింక్ వంటి ఖనిజ లవణాలు, విటమిన్–డి లభించే పదార్థాలతో లభ్యమవుతుంది. కొరమీను, సాల్మన్ వంటి చేపలు, వేటమాంసం... అందునా ప్రత్యేకంగా కాలేయం వంటి మాంసాహారాలతో పాటు గుడ్లు, బీన్స్‌ల ద్వారా కూడా సమకూరుతుంది. పండ్లలో దానిమ్మ ద్వారా ఇది స్వాభావికంగా దొరుకుతుంది. ఆక్సిటోసిస్: ఇది హైపోథలామస్ ద్వారా ఉత్పత్తి అయి, పిట్యుటరీ గ్రంథి ద్వారా విడుదల అవుతుంది. ఇది మన సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేయడంతో పాటు, సంతానసాఫల్యానికి, బిడ్డపుట్టాక మళ్లీ పీరియడ్స్ క్రమంగా రావడానికి ఉపయోగపడుతుంది. తీసుకోవాల్సినవి: విటమిన్–డి ఎక్కువగా ఉండే ఆహారాలైన గుడ్లు, చికెన్, పాలు, తృణధాన్యాలతో పాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఉసిరి, జామ, బెర్రీపండ్లు, టోమాటో, నిమ్మలలో లభ్యమవుతుంది. అంతేగాక బాదం, అవకాడో, డార్క్‌చాక్లెట్లు, అరటిపండ్లు, పెరుగు, బ్రాకలీలలో దొరుకుతుంది. గ్లూకోజ్ మెటబాలిజమ్: మహిళల్లో గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరగడం అవసరం. దాని వల్ల డయాబెటిస్ నివారితమవుతుంది. తీసుకోవాల్సినవి: మెంతులు, మెంతికూర వంటివి తీసుకోవడం ద్వారా ‘డియోస్జెనిన్’ అనే ఒక రకం ఈస్ట్రోజెన్ లభ్యమవుతుంది. దీని వల్ల గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. అలాగే బాదం నుంచి ‘ఎడిపోన్సెటిన్’ అనే స్వాభావిక ప్రోటీన్ లభ్యం కావడం వల్ల కూడా గ్లూకోజ్ మెటబాలిజమ్ సక్రమంగా జరుగుతుంది. ఎస్ట్రాడియాల్: ఇది మహిళలకు అవసరమైన హార్మోన్. దీన్నే ఈస్ట్రోజెన్ అని వ్యవహరిస్తుంటారు. ఇది తగ్గడం వల్ల యోని సంబంధమైన రుగ్మతలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన ఆహారాలు: అవిశగింజలు, సోయా ఉత్పాదనలు, తాజాపండ్లు, నట్స్, డ్రైఫ్రూట్స్ వంటి వాటి ద్వారా ఈస్ట్రోజెన్ స్వాభావికంగా సమకూరుతుంది.సుజాతా స్టీఫెన్చీఫ్ న్యూట్రిషనిస్ట్యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్ -
నాకు సంతానం కలిగే అవకాశం ఉందా?
నా వయసు 34 ఏళ్లు. వివాహమై ఎనిమిదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్యపరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? ఇటీవల చాలామందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు : ∙హార్మోన్ సంబంధిత సమస్యలు ∙థైరాయిడ్ ∙పొగతాగడం ∙శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ∙ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ∙సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ : అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్యపరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ అప్పుడు వచ్చిన పైల్స్... ఇంకా బాధిస్తున్నాయి! నా వయసు 29 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా సమస్య తరచూ వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. దయచేసి నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వగలరు. గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు: దీర్ఘకాలికంగా మలబద్ధకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా: మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరిస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్ తగ్గుతుందా? నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ చాలామందిని బాధపెడుతున్న సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతం మంది స్త్రీ, పురుషులు దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది దీన్ని కేవలం చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇందులో చర్మకణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడతాయి. ఇలా పొరలుగా ఏర్పడటం వల్ల అక్కడ వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివి ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువగా ఉంటూ చిరాకు పెడుతుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు : ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది. నిర్ధారణ పరీక్షలు : స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధి విషయంలో వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
దానికి నిర్ణీత వయసు ఉంటుందా?
మా అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. ఈమధ్య రజస్వల అయింది. చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల భవిష్యత్తులో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని బంధువులు ఒకరు చెప్పారు. భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రజస్వల కావడానికి నిర్ణీత వయసు అంటూ ఉంటుందా? – జీఎన్, ఖమ్మం సాధారణంగా రజస్వల 12 సంవత్సరాల నుంచి 15–16 సంవత్సరాల లోపల అవుతారు. ఈమధ్య కాలంలో తినే ఆహారంలో మార్పులు, జంక్‌ఫుడ్, అధికబరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక మార్పులు...ఇలా ఎన్నో కారణాల వల్ల కొందరు 10 సంవత్సరాలకే రజస్వల అవుతున్నారు. మీ అమ్మాయి 13 సంవత్సరాలకు అయింది. తను కరెక్ట్ వయసుకే అయింది. దీనివల్ల ఇబ్బంది ఏమిలేదు. అంతకంటే ముందే అంటే 10–11 సంవత్సరాలకే అయిన వాళ్ళలో కొందరిలో ముందునుంచే ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల అవ్వడం వల్ల, ఎముకల పెరుగుదల తొందరగా ఆగిపోయి, ఎప్పుడు ఎత్తు పెరగకుండా ఆగిపోతారు. వీరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ కాలం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, కొందరిలో తర్వాత కాలంలో పిల్లలు పుట్టకపోవడం, అధికబరువు వంటి ఇతర కారణాలు జత కలసినప్పుడు వారికి రక్తపోటు, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి వీరు క్రమంగా వ్యాయామాలు చేస్తూ బరువు పెరగకుండా ఉండటం, అప్పుడప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, రక్తపరీక్షలు, స్కానింగ్ చెయ్యించుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు లేదా ముందుగా తెలుసుకుని చికిత్స తీసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నాకు నిద్ర సరిగా పట్టడం లేదు. ‘పొజిషనల్ థెరపీ’ వల్ల గర్భిణులకు చక్కగా నిద్ర పడుతుందని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేగలరు. – పి.నీరజ, పొద్దుటూరు గర్భిణి సమయంలో బిడ్డ పెరిగేకొద్ది బరువు నడుము మీద పడడం, పడుకున్నప్పుడు అటూ ఇటూ తిరగడానికి ఇబ్బంది, అసౌకర్యంతో నిద్ర సరిగా పట్టదు. (పెరిగే బిడ్డ బరువు, సాగే గర్భాశయం ఒత్తిడి వెన్నుపూస మీద ఉంటుంది. గర్భవతి వెల్లకిలా పడుకున్నప్పుడు దానివల్ల వెన్నుపూసకు లోపలివైపు గర్భశయానికి మధ్యలో ఉండే ఇన్ఫీరియర్ వీనకేవా (ఐవీసీ) ఆర్టెరీ అనే రక్తనాళం పై పడి తల్లికి, బిడ్డకి రక్తసరఫరా సరిగా లేకపోవడం వల్ల, అలాగే వెల్లకిలా పడుకున్నప్పుడు, తల్లికి ముక్కు నుంచి శ్వాస సరిగా అందకపోవడం వల్ల, తల్లికి సరిగా నిద్రపట్టకపోవటం అలాగే బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్ అందక బరువు పెరగక పోవడం, కొందరిలో కడుపులో చనిపోయే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. కాబట్టి తల్లి ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల రక్తనాళాలపైన ఒత్తిడి తగ్గి, రక్తసరఫరా ఇద్దరికీ సరిగా ఉంటుంది. తల్లి నిద్రపోవడం ఎంత మంచిదో అలాగే సరైన పొజిషన్లో పడుకోవడం కూడా తల్లికి బిడ్డకి చాలామంచిది. అందుకోసం పొజిషనల్ థెరపీని వాడడం మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇందులో నడుంకి ఒక బెల్టులాంటిది కట్టుకొని, దానికి వెనకాల వైపులో తక్కువ బరువు ఉన్న చిన్న బాల్స్‌ని ఉంచడం వల్ల, తల్లి నిద్రలో తెలియకుండ వెల్లకిలా పడుకోడానికి తిరిగినా, బాల్స్ వల్ల కలిగే అసౌకర్యం వల్ల, ఒకవైపుకే (ఎడం వైపు) తిరిగి పడుకోవడం జరుగుతుంది. దీని వల్ల తల్లికి నిద్ర సరిగా పడుతుంది, అలాగే బిడ్డకి కూడా రక్తప్రసరణ సరిగా ఉంటుంది. మా అమ్మాయి స్వభావరీత్యా చాలా కూల్ అయితే ఈ మధ్య కాస్త ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది. అకారణంగా కోపం తెచ్చుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతుంది. ఒక స్నేహితురాలిని సలహా అడిగితే ‘ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటూ ఏదో చెప్పింది. దీని నివారణ చర్యలు ఉంటే తెలియజేయగలరు. – డీఎన్, భువనగిరి కొంతమందిలో హార్మోన్లలో మార్పుల వల్ల పీరియడ్స్ మొదలయ్యే 15 రోజులు ముందు నుంచి టెన్షన్, కోపం, చిరాకు, డిప్రెషన్, శరీరం ఉబ్బడం, అలసట, రొమ్ములు బరువుగా నొప్పిగా ఉండడంలాంటి లక్షణాలు ఉండవచ్చు. దీనినే ‘ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్’ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మెడిటేషన్, యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల కొద్దిగా ఉపశమనం దొరకుతుంది. ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవటం, పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవటం మంచిది. అలాగే విటమిన్ బి6, ఇ, కాల్షియం, మెగ్నీషియంతో కూడిన విటమిన్ టాబ్లెట్స్ వాడవచ్చు. ప్రిమ్రోజ్ ఆయిల్ క్యాపుల్స్ వాడి చూడవచ్చు. మరీ టెన్షన్, చిరాకు లక్షాణాలు తీవ్రంగా ఉంటే డాక్టర్ పర్యవేక్షణలో యాంటీడిప్రెషన్ మందులు వాడొచ్చు. హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్లు గర్భం దాల్చవచ్చా? చాలా రిస్క్ అని మా బంధువులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – కె.ప్రీతి పిడుగురాళ్ల గుండెజబ్బులు ఉన్నవాళ్లలో, గుండె పనితీరులో తేడా ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత రక్తం పల్చబడుతుంది. గుండె ఎక్కువ రక్తం సరఫరా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు కొట్టుకోవలసి ఉంటుంది. గుండె మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు, బలహీనంగా ఉన్న గుండె పైన ఒత్తిడి పెరగడం వల్ల, ఆయాసం పెరగడం, ఊపిరి ఆడకపోవడం, హర్ట్ ఫెయిల్ అవ్వడం, రక్తం గూడుకట్టడం వంటి ప్రాణాపాయస్థితి కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే అబార్షన్లు. శిశువు బరువు పెరగకపోవడం, కడుపులో చనిపోవడం, నెలలు నిండకుండా కాన్పులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరి గుండె జుబ్బును బట్టి, దాని తీవ్రతను బట్టి గర్భం దాల్చిన తర్వాత సమస్యల తీవ్రత ఉంటుంది. గుండెజబ్బు ఉన్న వాళ్లు గర్భం దాల్చకముందే, డాక్టర్‌ను సంప్రదించి వారి గుండె పనితీరు ఎలా ఉంది, గర్భం దాల్చవచ్చా లేదా గర్భం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలుసుకొని ప్రయత్నం చేయడం మంచిది. ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేయకపోవడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ ,బర్త్‌రైట్ బై రెయిన్బో ,హైదర్‌నగర్ హైదరాబాద్ -
14,15 తేదీల్లో హార్మోన్అండ్ హెల్త్ ఎక్స్పో–2016
సాక్షి, విశాఖపట్నం : మహిళలు, యువకులు, బాలికల్లో వస్తున్న హార్మొన్లసమస్యలు–శాస్త్రీయ పరిష్కారంపై విశాఖపట్నంలోని కళావాణిపోర్టు ఆడిటోరియంలో ఈ నెల 14, 15 తేదీల్లో హార్మోన్ అండ్ హెల్త్ ఎక్స్పో–2016 నిర్వహిస్తున్నట్టు సాయిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రినాలజీ ప్రతినిధి, ప్రొ.శ్రీవల్లి తెలిపారు. ఈసదస్సును రాష్ట్ర మానవవనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస్, పోర్టు చైర్మన్ ఎం.టి.కష్ణబాబులు ప్రారంభిస్తారన్నారు. అదేరోజు సాయంత్రం జరిగే మెడి కూచిపూడిని ఎంపీకంభంపాటి ప్రారంభిస్తారన్నారు. ఈసదస్సులో పాల్గొనదల్చిన వారు మరిన్ని వివరాల కోసం0891–2563969లో సంప్రదించాలని కోరారు.