
టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. భూమా మౌనికను పెళ్లాడాడు. మార్చి 3న జరిగిన వీరి వివాహానికి అతి దగ్గరి బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మనోజ్ పెళ్లి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించడం విశేషం.
'పెళ్లి.. మ్యారేజ్.. మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం.. సారీ, మావాడు ఆరడుగులు కదా, సో సెంటిమెంటల్‌గా ఉంటుందని బ్రేకింగ్ ద రూల్స్! M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి!' అంటూ మనోజ్, మౌనికల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చాడు వెన్నెల కిశోర్. 'వయసుతో సంబంధం లేకుండా, రేంజును చూడకుండా నచ్చితే నావాడు, మెచ్చితే మనోడు.. అదే మంచు మనోజ్ లైఫ్ స్టైల్. డిగ్రీ సర్టిఫికెట్‌లు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ మాత్రం 14 ఉన్నాయి. మనోడికి ఫారిన్ వెళ్లి మరీ చదివిన సీమబిడ్డ భూమా మౌనికతో ఆ దేవుడు ముడి వేశాడు. వీళ్లిద్దరిదీ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్.
నేను నీకెలా సాయపడగలను? అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు.. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్' అని ముగించాడు వెన్నెల కిశోర్.
Comments
Please login to add a commentAdd a comment