
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా ‘ఉస్తాద్–ర్యాంప్ ఆడిద్దాం’ పేరిట సరికొత్త టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌కు హాజరైన మనోజ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తన భార్య మౌనిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మనోజ్ మట్లాడుతూ..' ఏడేళ్ల గ్యాప్ తర్వాత.. ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నా. ఆ గ్యాప్‌లో చాలా డిఫరెంట్ లైఫ్‌ను చూశా. అంతుకుముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. కానీ ఏడేళ్ల తర్వాత మీ ప్రేమ, బాధ్యతతోనే వచ్చా. నాకు ధైర్యమిచ్చింది ఫ్యాన్స్ ప్రేమనే. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స్ ప్రేమ విలువ తెలిసింది. నాకు మంచి టీం దొరికింది' అని అన్నారు.
అయితే ఈ ఈవెంట్‌కు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా హాజరయ్యారు. మౌనికతో ప్రేమలో పడ్డాకే తనకు ఫ్యాన్స్ విలువ తెలిసి వచ్చిందని మనోజ్ మాట్లాడారు. దీంతో వేదికపై మంచు మనోజ్ మాట్లాతుండగానే మౌనిక ఫుల్ ఎమోషనల్ అయింది. తన భర్త మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment