Manchu Manoj And Mounika Reveals About Their Love Journey, Deets Inside - Sakshi
Sakshi News home page

Manchu Manoj: నన్ను నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి నిలబడి ఉంది.. మనోజ్‌ ఎమోషనల్‌

Published Thu, Apr 13 2023 3:44 PM | Last Updated on Thu, Apr 13 2023 4:10 PM

Manchu Manoj And Mounika Reveals About Their Love Journey - Sakshi

టాలీవుడ్‌ హీరో, మంచు వారబ్బాయి మనోజ్‌ ఇటీవలే పెళ్లి చేసుకుని జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భూమా మౌనికను పెళ్లాడి ఆమెతో కొత్త జీవితం ఆరంభించాడు. స్నేహితులుగా మొదలైన వీరి ప్రయాణం తర్వాత ప్రేమగా మారగా దాన్ని పెళ్లితో పదిలపరుచుకున్నారిద్దరూ. మార్చి 3న మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ఈ కొత్త జంట ఓ షోలో పాల్గొని తమ ప్రేమ కహానీని బయటపెట్టింది.

ముందు మనోజ్‌ మాట్లాడుతూ.. మా ఇద్దరిలో తానే ఎక్కువ రొమాంటిక్‌ అని చెప్పాడు. మౌనిక మాట్లాడుతూ.. అమ్మ చనిపోయాక ఆమె జయంతి రోజు ఆకాశం వైపు చూస్తూ ఎక్కడున్నావమ్మా.. నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని నాలో నేను మాట్లాడుకున్నాను. అప్పుడు ఎంతో బాధలో ఉన్నాను. ఆరోజు మనోజ్‌ ఆళ్లగడ్డకు రాడేమో అనుకున్నాను... ఆరోజు నేను నా జీవితంలో మర్చిపోలేను. పెళ్లికి ముందు మనోజ్‌ కోపాన్ని ఎలా డీల్‌ చేస్తానో అనుకున్నా. కానీ మనోజే ఇప్పుడు నా కోపంతో డీల్‌ చేస్తున్నాడు' అని చెప్పుకొచ్చింది మౌనిక.

ప్రేమ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మనోజ్‌ మాట్లాడుతూ.. 'ప్రేమ అనేది రెండుపక్కలా ఉండాలి. ఒకానొక సమయంలో ఎక్కడున్నాను? ఎటు వైపు వెళ్తున్నాను? అనేది అర్థం కాలేదు. అప్పుడు ప్రేమ? సినిమా? ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది. నన్ను నమ్ముకుని ఒక బిడ్డతో అమ్మాయి నిలబడి ఉంది.. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్‌ అనుకున్నాను' అని చెప్పుకొచ్చాడు మనోజ్‌. అలా మౌనికను పెళ్లాడి ఆమె కొడుకు బాధ్యతను సైతం తనే స్వీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement