
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీ.టెక్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. సురారం కాలనీలో నివసిస్తున్న చంద్రం, రేణుక దంపతుల కుమార్తె మౌనిక స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో బీ.టెక్ ఫైనలియర్ చదువుతోంది.
బుధవారం అర్థరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ అప్‌లోడ్ చేసిన మౌనిక.. తన జీవితం దుర్భరంగా తయారైందని పేర్కొంది. తాను సంతోషంగా ఉండటం చుట్టుపక్కల వారు చూడలేకపోతున్నారని చెప్పింది. అనంతరం ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, బుధవారం మౌనికకు తన తమ్ముడితో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు మౌనిక తల్లి రేణుక తెలిపారు. తమ్ముడితో గొడవ అనంతరం మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.
చంద్రం, రేణుకల స్వస్థలం పశ్చిమ గోదావరి. ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు సురారం కాలనీలో నివాసముంటున్నారు. అయితే చంద్రం, రేణుకల మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. కాగా, మౌనిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment