
అవును, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. మంచు మనోజ్, భూమా మౌనికలు మొదట్లో కేవలం స్నేహితులు మాత్రమే! ఒకరిపై ఒకరికి ఉన్న ఆప్యాయత వారిని ఒక మెట్టు ఎక్కించి ప్రేమసాగరంలోకి తీసుకెళ్లింది. పెద్దల ఆశీర్వాదంతో ఆ ప్రేమను గెలిచి పెళ్లిపీటలెక్కారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. ఈ పెళ్లిని భుజాన వేసుకున్న మంచు లక్ష్మి తన స్వగృహంలోనే ఈ వేడుక జరిపించింది.
మనోజ్-మౌనికలకు ఇది రెండో వివాహం అన్న విషయం తెలిసిందే! మౌనికకు ధైరవ్ రెడ్డి అనే కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లి ఫోటోల్లో ధైరవ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తాజాగా మంచు మనోజ్ ఆసక్తికరమైన ఫోటో షేర్ చేశాడు. ఇందులో మౌనిక చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు మనోజ్. ఈ ఇద్దరి చేతులను ఓ పిల్లవాడు తన హస్తాలతో పట్టుకున్నాడు. దీనికి శివుని ఆజ్ఞ అని క్యాప్షన్ జోడించాడు. ఆ పిల్లవాడు మరెవరో కాదు, ధైరవ్ రెడ్డి. ఇక మీదట వీరిద్దరి బాధ్యత తనదే అని మనోజ్ చెప్పకనే చెప్పాడని తెలుస్తోంది.
శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023
Comments
Please login to add a commentAdd a comment