విద్యార్థిని ఆత్మహత్య: వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు | Student sets fire to furniture in Satyabhama university | Sakshi
Sakshi News home page

విద్యార్థిని ఆత్మహత్య: వర్సిటీలో ఆగ్రహ జ్వాలలు

Published Wed, Nov 22 2017 9:20 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Student sets fire to furniture in Satyabhama university - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడంతో, తోటి విద్యార్థులు విధ్వంసం సృష్టించారు. ఈ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌ లో మొదటి సంవత్సరం చదువుతోన్న హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక అనే విద్యార్థిని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే. వర్సిటీలో రాధా మౌనిక ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్ధుల విధ్వంసానికి పాల్పడ్డారు. హాస్టల్, తరగతి గదులలోని ఫర్నిచర్‌తో పాటు బస్సులు, ఇతర వాహనాలకు విద్యార్థులు నిప్పుపెట్టారు. తమ స్నేహితురాలి మృతికి యాజమాన్యమే కారణమంటూ వారు ఆందోళన చేపట్టారు.

వర్సిటీ ప్రాంగణంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి కాలేజీ యాజమాన్యం సమాచారం అందించింది. వర్సిటీకి చేరుకున్న పైర్ ఇంజన్లను విద్యార్దులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే యత్నం చేశారు. వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని లోనికి వెళ్లనిచ్చి మంటల్ని అదుపులోకి తీసుకురావాలని చూస్తున్నారు.

కాగా, రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ లో కాపీ కొట్టిందని మౌనికను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక.. మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని స్నేహితులకు మెసేజ్ పెట్టి హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

(చదవండి : 'సత్యభామ'లో హైదరాబాద్‌ యువతి ఆత్మహత్య)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement