సాక్షి, చెన్నై: చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్ధిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌కు చెందిన రాధ మౌనిక కంప్యూటర్ ఇంజినీరింగ్ లో మొదటి సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల కిందట కళాశాలలో జరిగిన ఇంటర్నల్ ఎగ్జామ్ సందర్భంగా మౌనిక కాపీ కొట్టిందని.. దీంతో ఆమెను ఎగ్జామ్ హాల్ నుంచి అధ్యాపకులు బయటకు పంపించి వేశారు. తదుపరి పరీక్షలకు కూడా అనుమతించలేదు. దీంతో అందరిలో అవమానంగా భావించిన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్, లవ్ యూ ఆల్ అని మెసేజ్ పెట్టింది. మౌనిక ఆత్మహత్యకు పాల్పడటంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మౌనిక మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్రు చేస్తున్నారు. మౌనిక ఆత్మహత్య చెన్నైలో విద్యాబ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్థుల్లో బయాందోళనకు గురి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment