టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు మౌనిక మెడలో మూడు ముళ్లు వేశాడు మనోజ్. వేద మంత్రాల సాక్షిగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వైఎస్ విజయమ్మ గారు, టి జి వెంకటేష్, కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ తదితరులు ఈ పెళ్లికి హాజరయ్యారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మికి ఎంతో ఇష్టం. తమ్ముడి మీదున్న కొండంత ప్రేమతో అతడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది. ఇప్పటికే మనోజ్‌ను పెళ్లికొడుకును, మౌనికను పెళ్లి కూతురును చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
Comments
Please login to add a commentAdd a comment