
చింతలపూడి మార్చురీ వద్ద మౌనిక బంధువులు, పోలీసు అధికారులతో మాట్లాడుతున్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా
చింతలపూడి: అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన స్థానిక ఎన్‌వీఎన్ కాలనీకి చెందిన మానేపల్లి మౌనిక మృతికి కారణమైన భర్త రామును కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. పెళ్లి జరిగి ఏడాది గడవక ముందే మౌనిక (22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్తే మౌనికను హత్య చేశాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మృతదేహం కుళ్ళిపోతున్నా పోస్టుమార్టం నిర్వహించకుండా ఆలస్యం చేయడంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. చింతలపూడి మార్చురీ వద్ద మౌనిక బ«ంధువులు పెద్ద ఎత్తున చేరడంతో సీఐ పి.రాజేష్, ఎస్‌ఐ సీహెచ్ వెంకటేశ్వరరావులు మార్చురీ వద్దకు చేరుకుని బాధితులతో చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతోను, మృతురాలి కుటుంబ సభ్యులతోను మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎలీజా డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.‡ సీఐ రాజేష్ మాట్లాడుతూ నిందితునికి తప్పకుండా శిక్ష పడుతుందని, జంగారెడ్డిగూడెం డీఎస్‌పీ సీహెచ్ మురళీకృష్ణ ప్రత్యేకంగా కేసును çపర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మౌనిక మృతికి కారణాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment