
మచిలీపట్నం: యంగ్ రైటర్ ప్రసన్న కుమార్, మౌనికల వివాహ బంధంతో ఒకటయ్యారు. మచిలీపట్నంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ జరిగింది. ప్రసన్న కుమార్, మౌనికల వివాహానికి సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు త్రినాద్‌రావు నక్కిన, హీరో అశ్విన్, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, రామ్ ప్రసాద్, మాస్ అవినాష్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు నూతన వధూవరులకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ అందజేస్తున్నారు.(హ్యాపీ బర్త్‌డే డియర్ సోనూసూద్)
కాగా, నేను లోకల్, సినిమా చూపిస్త మావ, హాలో గురు ప్రేమ కోసమే సినిమాలకు రచయితగా పనిచేసిన ప్రసన్న కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలోనే ఆయన.. రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాకు కథ, మాటలు అందించనున్నాడు. అలాగే వాలీ బాల్ ప్లేయర్ అరికపూడి రమణరావు జీవిత చరిత్ర ఆధారంగా మరో కథను సిద్ధం చేస్తున్నాడు. (సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు)
Comments
Please login to add a commentAdd a comment