
టాలీవుడ్ ఫ్యామిలీ మంచు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. గత కొంతకాలంగా మంచు మనోజ్ పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అందరూ అనుకుంటున్నట్లుగానే భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం మార్చి 3న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారైంది.
కాగా.. ఇప్పటికే మెహందీకి సంబంధించిన ఫోటోలను మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మనోజ్- మౌనికల వివాహం జరగనుంది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఇంటిలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇరువర్గాల కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లిపై చాలా సార్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment