
వరంగల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత భూక్యా మౌనిక(28) ఆత్మహత్య చేసుకు న్న ఘటన మండలంలోని పకీరతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మంగీలాల్ కథనం ప్రకారం.. మానుకోట జిల్లా నర్సింహులపేట మండలం పకీరతండాకు చెందిన భూక్యా వెంకన్న, బుల్లిల కుమారుడు రాంబాబుతో 11 సంవత్సరాల కిత్రం బయ్యారం మండలంలోని చోక్లాతండాకు చెందిన తేజావత్ హుస్సేన్ కుమార్తె మౌనికకు వివాహం జరిగింది.
ఈక్రమంలో అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, మామ వేధించడంతో ఇంట్లోనే మౌనిక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
మౌనికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి తేజావత్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తలపైన బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరుగుతుందని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment