married woaman Suicide
-
మౌనికది హత్యా, ఆత్మహత్యా! పురుగుల మందు తాగితే తలపై గాయం ఎక్కడిది?
వరంగల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులతో వివాహిత భూక్యా మౌనిక(28) ఆత్మహత్య చేసుకు న్న ఘటన మండలంలోని పకీరతండాలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై మంగీలాల్ కథనం ప్రకారం.. మానుకోట జిల్లా నర్సింహులపేట మండలం పకీరతండాకు చెందిన భూక్యా వెంకన్న, బుల్లిల కుమారుడు రాంబాబుతో 11 సంవత్సరాల కిత్రం బయ్యారం మండలంలోని చోక్లాతండాకు చెందిన తేజావత్ హుస్సేన్ కుమార్తె మౌనికకు వివాహం జరిగింది. ఈక్రమంలో అదనపు కట్నం తేవాలని భర్త, అత్త, మామ వేధించడంతో ఇంట్లోనే మౌనిక పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మౌనికకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి తండ్రి తేజావత్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తలపైన బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరుగుతుందని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. -
కలిసి జీవించలేక..
సాక్షి, తాడిపత్రి అర్బన్: ఆమె పెళ్లయిన తర్వాత ప్రేమలో పడింది. అయితే కలిసి జీవించడానికి సమాజం ఒప్పుకోదని భావించి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నాలుగవ రోడ్డుకు చెందిన అఫ్రీన్(21)కు తాడిపత్రి మండలం మిట్టమీద కొట్టాలపల్లికి చెందిన హాజీవలితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఇదే కొట్టాలపల్లిలో నివాసం ఉంటున్న మంగలి నరసింహుడితో ఆమెకు చనువు ఏర్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మండల పరిధిలోని దర్గా ఉరుసులో పాల్గొనేందుకు హాజీవలి తన భార్య అఫ్రీన్‌తో కలసి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అఫ్రీన్ ప్రియుడు నరసింహుడితో కలసి దర్గా నుంచి తాడిపత్రికి వచ్చి స్త్రీశక్తి భవన్ వెనుక వైపున ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మనస్తాపం.. క్షణికావేశం
కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి మనస్పర్థలు ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్నాయి. తీవ్ర మనోవేదనకు గురైన ఆ తల్లి చనిపోవాలనుకుంది. తన ఇద్దరు చిన్నారులను కూడా వెంట తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే నిండుగా ప్రవహిస్తున్న జూరాల ప్రాజెక్టు కుడి కాలువలో దూకి కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. గద్వాల క్రైం: గద్వాల జిల్లాకేంద్రంలోని బృందావన్ కాలనీకి చెందిన తెలుగు రాజేష్‌ను నాగర్‌కర్నూల్‌కు చెందిన సునిత (27)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు అమృత(5), వైష్ణవి(3) ఉన్నారు. ప్రస్తుతం 5 నెలల గర్భిణీ. ఎంతో అన్యోన్యంగా సాగే వీరి సంసారంలో ఇటీవలే చిన్నచిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాత్రి పిల్లల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సునిత మంగళవారం తెల్లవారుజామున ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా పిల్లలను వెంట పెట్టుకొని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి కాలువ వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం నుంచి భార్యా పిల్లలు కన్పించక పోవడంతో చుట్టు పక్కల, బంధువుల ఇళ్లల్లో వాకాబు చేసినా ఆచూకి లభించలేదు. చిన్నారి మృతదేహంతో వెలుగులోకి.. భర్త, తల్లిదండ్రులు, బంధువులు గ్రామంలో వెతుకుతుండగా జములమ్మ రిజర్వాయర్‌లో ఓ పసికందు మృతదేహం తెలియాడుతూ కన్పించింది. రిజర్వాయర్‌లోకి వెళ్లి చూడగా అది రాజేష్ కుతూరు వైష్ణవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కాలువ గట్టున కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని పీజేపీ అధికారులతో మాట్లాడారు. కాలువలోని నీటిని నిలిపి వేయించారు. గజ ఈతగాళ్లను రప్పించి మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడుతుడడంతో గద్వాల సీఐ రవి, రూరల్ ఎస్ఐ అంజద్‌అలీ మరో ఇద్దరు గజ ఈతగాళ్ల సహాయంతో రిజర్వాయర్‌లో గాలింపు ముమ్మరం చేశారు. పట్టణంలో చర్చనీయాంశం అయిదు నెలల గర్భిణీ తన ఇద్దరు చిన్నారులను తీసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో పట్టణంలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందనే విషయం తెలియక ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. భార్యభర్తల మధ్య తలెత్తిన వివాదమా.. లేక మరేదైనా కారణమా అనే విషయం తెలియరాలేదు. ఈ సంఘటనతో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబసభ్యులు ఏటివద్దే ఉండి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అత్తింటి వేధింపులకు బలి
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య భర్త, అత్తమామలే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ బొమ్మూరు (రాజమండ్రి రూరల్) :భర్త, అత్తమామల వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బొమ్మూరు గ్రామంలోని రాఘవేంద్రనగర్‌లో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మూరుకు చెందిన 108 టెక్నీషియన్ కాండ్రేగుల రవికుమార్‌కు, రాజమండ్రి సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ రమణ కుమార్తె స్వాతి(28)కి 2010లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె లిఖిత ఉంది. విశాఖపట్నంలో ఉన్న రవికుమార్ తల్లిదండ్రులు నెలకోసారి ఇక్కడకు వచ్చి, వెళుతుంటారు. నర్సరీ చదువుతున్న లిఖితను స్వాతి ఉదయం, సాయంత్రం స్కూలుకు తీసుకెళ్లి, తీసుకొస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం లిఖితను స్కూల్‌కు తీసుకువెళ్లిన స్వాతి, సాయంత్రం తీసుకురాలేదు. దీంతో స్కూలు వారు రవికుమార్‌కు ఫోన్ చేసి, పాపను తీసుకువెళ్లాలని చెప్పారు. వెంటనే రవికుమార్ భార్య స్వాతికి ఫోన్ చేయగా, ఎంతసేపటికీ స్పందించలేదు. డ్యూటీలో ఉన్న అతడు ఇంటి కి వచ్చాడు. ఈలోగా పాపను పక్కింటి అబ్బాయి స్కూలు నుంచి తీసుకొచ్చాడు. ఇంటిలోపలికి రవికుమార్ వెళ్లిచూడగా.. స్వాతి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఈ విషయాన్ని అతడు పక్కింటి వారికి చెప్పాడు. 108 పైలట్‌కు ఫోన్ చేసి తన భార్యకు బాగోలేదని చెప్పడంతో.. అతడు 108ను తీసుకొచ్చాడు. స్వాతి మరణించినట్టు అతడు గుర్తించాడు. రవికుమార్ అత్తమామలకు ఆ పైలట్‌తో ఫోన్ చేయించాడు. వారి కుమార్తెకు నీరసంగా ఉందని, రావాలని చెప్పించాడు. స్వాతి తల్లిదండ్రులు వెంకటలక్ష్మి, రమణ, సోదరుడు సుధీర్ అక్కడకు చేరుకున్నారు. స్వాతి చనిపోయిందని తెలియగానే బోరున విలపించారు. అత్తమామలు రాకముందే రవికుమార్ తన కుమార్తెతో అక్కడి నుంచి పరారయ్యాడు. బొమ్మూరు ఎస్సై నాగేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని, విషయాన్ని ఉన్నతాధికారులకు అందజేశారు. డీఎస్పీలు అస్మా ఫర్హీన్, అంబికాప్రసాద్, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కనకారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలాన్ని పరిశీలించింది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే.. తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామల వేధింపులే కారణమని స్వాతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఎంబీఏ చదివిన స్వాతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. పెళ్లి జరిగి ఐదేళ్లు కావస్తున్నా.. ఎక్కువ కాలం తమ ఇంటిలోనే ఉండేదని చెప్పారు. తరుచూ గొడవలు జరగడం, పెద్దల సమక్షంలో రాజీ కుదిర్చి కాపురానికి పంపించడం జరిగాయని వివరించారు. నెల రోజుల క్రితం ఇదే పరిస్థితి తలెత్తితే.. తమను ఇంటికి రావొద్దని, ఫోన్లో మాట్లాడవద్దని రవికుమార్ వేధించినట్టు చెప్పారు. పుట్టింటికి వెళ్లి విలువైన సామాన్లు తేవాలని తరుచూ వేధించేవాడని ఆరోపించారు. పెళ్లి సమయంలో రూ.4 లక్షలు కట్నం, సామాన్లు ఇచ్చినట్టు వివరించారు. ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు అప్పు ఇప్పించి, దాని వడ్డీ కూడా చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.