
మృతుడు నరసింహుడు, అఫ్రీన్ (ఫైల్)
సాక్షి, తాడిపత్రి అర్బన్: ఆమె పెళ్లయిన తర్వాత ప్రేమలో పడింది. అయితే కలిసి జీవించడానికి సమాజం ఒప్పుకోదని భావించి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురం నాలుగవ రోడ్డుకు చెందిన అఫ్రీన్(21)కు తాడిపత్రి మండలం మిట్టమీద కొట్టాలపల్లికి చెందిన హాజీవలితో రెండేళ్ల కిందట వివాహమైంది. ఇదే కొట్టాలపల్లిలో నివాసం ఉంటున్న మంగలి నరసింహుడితో ఆమెకు చనువు ఏర్పడినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి మండల పరిధిలోని దర్గా ఉరుసులో పాల్గొనేందుకు హాజీవలి తన భార్య అఫ్రీన్‌తో కలసి వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత అఫ్రీన్ ప్రియుడు నరసింహుడితో కలసి దర్గా నుంచి తాడిపత్రికి వచ్చి స్త్రీశక్తి భవన్ వెనుక వైపున ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment