Manchu Manoj And Bhuma Mounika Reddy Shares Their Interesting Love Story - Sakshi
Sakshi News home page

Manchu Manoj: నాకు కొత్త లైఫ్ ఇచ్చింది తనే.. అదొక మిరాకిల్: మనోజ్ ఎమోషనల్

Published Wed, Apr 26 2023 10:01 PM | Last Updated on Thu, Apr 27 2023 9:36 AM

Manchu Manoj and Bhuma Mounika Shares Their Love Story - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌, భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించాడు. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌- మౌనికలు ఒక్కటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటైన ఈ జంటకు పెద్దఎత్తున అభిమానులు, సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మనోజ్, మౌనిక ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ పరిచయం, ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లికి ముందు పడిన కష్టాలను 

మంచు మనోజ్ మాట్లాడుతూ.. 'మా ఇరు కుటుంబాలకు దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉంది. కానీ అనుకోకుండా మా ఇద్దరి లైఫ్‌లో చెరోదారిలో వెళ్లాం. ఆ తర్వాత నా కెరీర్‌లో చాలా ఇబ్బందులు పడ్డా. ఆ తర్వాత మేం మళ్లీ కలిసినప్పుడు మాట్లాడుకునే వాళ్లం. ఫస్ట్ నాకే ఆ ఫీలింగ్ వచ్చింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలంటే తన వల్లే నాకు లైఫ్ దొరికింది. నా లైఫ్‌లో బాధలు చూశా. ఒక రోజు తనతో నువ్వంటే ఇష్టమని చెప్పాను. నాకు మళ్లీ హ్యాపీగా బతకాలనుంది. నాకు కొత్త జీవితం నీ వల్లే వస్తుంది. నా జీవితం ఇలా ఉండడం నాకు నచ్చడం లేదు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నాకు మంచి లైఫ్ దొరుకుతుంది. నిన్ను, బాబును బాగా చూసుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మౌనిక  బాగా ఆలోచించావా? ఈ సోసైటీ ఏమనుకుంటుంది? ‍అని అడిగింది. ఆ తర్వాత తను ఒప్పుకుంది. ఆమెతో పాటు నాకు బాబు దొరకడం ఓ మిరాకిల్. ఆ తర్వాత కట్‌ చేస్తే ఉప్పెన. మా ప్రేమ అలా ఈశ్వర సాంగ్‌ను తలపించింది. లైఫ్‌లో తానే నాకు ఓ ఇన్‌స్పిరేషన్. ' అంటూ తన ప్రేమకథను వెల్లడించారు. 
(ఇది చదవండి: నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే: మంచు మనోజ్)

మౌనిక మాట్లాడుతూ..' మనోజ్ ఒక గ్రేట్ లర్నింగ్ సెంటర్. రాయలసీమలో పగవాడికి కూడా ఇలాంటి కష్టాలు రాకూడదు అనే సందర్భం ఒకటి మా జీవితాన్ని మలుపు తిప్పింది. యాక్సిడెంట్‌లో అమ్మ చనిపోవడం, నాన్నకు బై ఎలక్షన్‌. మాకసలు దాన్నుంచి బయటికి రావడానికే చాలా టైం పట్టింది. ఆ సమయంలో నాన్న చాలా ఇబ్బంది పడిపోయారు. నాన్న రూముకు వెళ్లడానికే మాకు కొన్ని నెలలు పట్టింది. అమ్మా, నాన్నను కోల్పోయాం. ఇంత కన్నా బ్యాడ్‌గా లైఫ్‌లో ఎవరికీ జరగదు. మమ్మల్ని చిన్నపిల్లలుగా చూసుకోవడానికి కూడా మాకు టైం లేదు. నేను, తమ్ముడు, అక్కా జీవితంలో చాలా మొండిగా మారిపోయాం. అమ్మ చనిపోయాక.. ఆమె బర్త్‌ డే రోజు ఆకాశం వైపు చూస్తూ 'మామ్.. నిన్ను నేను వదిలేశా'. నీవు నాకు తెలుసు.. ఐ వ్యాంట్ లీడర్ లైఫ్. అమ్మా నువ్వు ఎక్కడున్నా నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నా. నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడే ఉంచు. అయితే అమ్మ బర్త్‌ డే రోజు మనోజ్ వస్తున్నాడని నాకు తెలీదు. మనోజ్ రాడేమో అనుకున్నా. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేను. ఆయనను చూడగానే ఫుల్ ఎమోషనల్ అయ్యాను.' అంటూ తన ప్రేమతో పాటు జీవితంలో పడిన కష్టాలను పంచుకున్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement