ఈవెంట్‌కు సతీసమేతంగా హాజరైన మంచు మనోజ్! | tollywood Hero Manchu Manoj Attended For A Event With Wife In hyderabad | Sakshi
Sakshi News home page

Manchu Manoj: ఈవెంట్‌లో సందడి చేసిన మంచు మనోజ్ దంపతులు.. వీడియో వైరల్!

Published Tue, Feb 13 2024 3:33 PM | Last Updated on Tue, Feb 13 2024 3:55 PM

tollywood Hero Manchu Manoj Attended For A Event With Wife In hyderabad - Sakshi

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓ టీవీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మంచు మనోజ్  గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. అంతే కాదు ఇటీవలే తాను తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా వెల్లడించారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు. 

అయితే తాజాగా మంచు మనోజ్ దంపతులు హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. టీచ్ ఫర్‌ ఛేంజ్ అనే సంస్థ నిర్వహించిన ఫండ్‌ రైజింగ్‌కు ఈవెంట్‌కు సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ సందీప్ కిషన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement