నా మాటలు అపార్థం చేసుకున్నారు.. కానీ మా నాన్న: మంచు మనోజ్ | Tollywood Hero Manchu Manoj Clarity On His Comments Mohan Babu Birthday | Sakshi
Sakshi News home page

Manchu Manoj: ఎవరిని టార్గెట్‌ చేసి మాట్లాడలేదు.. నా ఉద్దేశం అదే: మంచు మనోజ్

Published Thu, Mar 21 2024 5:01 PM | Last Updated on Thu, Mar 21 2024 5:35 PM

Tollywood Hero Manchu Manoj Clarity On His Comments Mohan Babu Birthday - Sakshi

మోహన్‌ బాబు తనయుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్. ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే తన తండ్రి మోహన్‌ బాబు బర్త్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌లో ఏర్పాటు సమావేశంలో పొలిటికల్ కామెంట్స్ చేశారు. మంచి చేసే వాళ్లకే ఓటేయండి అంటూ యువతకు సలహా ఇచ్చారు మంచు మనోజ్. అయితే  అది కాస్తా వైరల్ కావడంతో తాజాగా మంచు మనోజ్ వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. 

మనోజ్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'మిత్రులకు, శ్రేయోభిషులకు, మీడియా సభ్యులకు ముందుగా ధన్యవాదాలు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించాలనుకుంటున్నా. నా తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో నేను చెప్పిన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారు. దానిపైనే స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్‌లో నా ప్రసంగం చుట్టూ కొంత గందరగోళం ఏర్పడింది. దేశంలో ఐక్యత, గౌరవం, రాజకీయ సరిహద్దులను అధిగమించడమే నా ప్రధాన ఉద్దేశం. దురదృష్టవశాత్తూ లైవ్ స్ట్రీమింగ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం కాలేదు. అందువల్లే తప్పుగా అర్థం చేసుకున‍్నారు. నేను వేదికపై ఉన్నప్పుడే అంతరాయం కలిగింది. అందుకే నా మాటల్లో కొన్ని మాత్రమే ప్రజలకు చేరాయి. ఈ పాక్షిక సమాచారాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని' అని అన్నారు. 

నా ప్రసంగంలో ఏ రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టంగా చెబుతున్నా. నా సందేశం కేవలం ఐక్యత, అవగాహనతో సార్వత్రిక విలువలను ప్రోత్సహించడమే లక్ష్యం. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు. నా వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కొనసాగిస్తున్నా. సాంకేతిక లోపాలను గుర్తించి క్షమాపణలు చెప్పినందుకు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు. పూర్తి అవగాహన కోసం నా ప్రసంగాన్ని ఎవరైనా పూర్తిగా వీక్షించడానికి నా ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశా. ఒక సినిమా నటుడిగా, సినిమా మాధ్యమం ద్వారా ఏకం చేయడం, వినోదం అందించడం నా ముందున్న లక్ష్యం. మీ మద్దతు, నా కుటుంబం, నా పట్ల మీరు చూపే అపారమైన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. కులం, మతం, మతానికి అతీతమైన వసుధైక కుటుంబం విలువలను మా నాన్న నేర్పించారు. ఒక కుటుంబంగా దానిని మేము విశ్వసిస్తాం. మరోసారి బుల్లితెరపై మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని పోస్ట్ చేశారు. మనోజ్ చేసిన కామెంట్స్ కాస్తా పొలిటికల్‌ వివాదానికి దారితీయడంతో ట్వీట్‌ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement