ఇంట్లోంచి పారిపోయిన బాలిక శవమై తేలిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అర్కపల్లి పరిధిలోని పల్లెతండాలో ఆదివారం చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్: ఇంట్లోంచి పారిపోయిన బాలిక శవమై తేలిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం అర్కపల్లి పరిధిలోని పల్లెతండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన మౌనిక (15) అనే బాలిక శనివారం రాత్రి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పటినుంచి తల్లిదండ్రులు ఆమె కోసం గాలించగా ఆదివారం మధ్యాహ్నం పొలం వద్ద శవమై తేలింది.
మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా ఉండటంతో అనుమానం వచ్చిన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.