
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. మార్చి మొదటి వారంలో భూమా మౌనికను పెళ్లాడబోతున్నాడనేది ఆ కథనాల సారాంశం. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందిస్తూ.. తామిద్దరం మంచి మిత్రులమని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడట. కష్టసమయాల్లో మౌనిక తనకు అండగా నిలబడిందని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండటం అదృష్టమని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కాగా మనోజ్, మౌనిక జంటగా చాలాసార్లు కనిపించడంతో ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. పైగా త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ ఆమధ్య హింట్ కూడా ఇచ్చాడు హీరో. దీంతో వీరి పెళ్లి జరగడం ఖాయమని అంతా ఫిక్సయ్యారు. కానీ ఇప్పటివరకు వీరి వివాహం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇకపోతే మనోజ్‌కు ఇదివరకే ప్రణతితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటు మౌనికకు కూడా ఇదివరకే పెళ్లవగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment