Manchu Manoj Wife Mounika at Mohan Babu Birthday, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Mohan Babu Birthday: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

Published Mon, Mar 20 2023 4:34 PM | Last Updated on Mon, Mar 20 2023 5:51 PM

Manchu Manoj Wife Mounika in Mohan Babu Birthday Photos Goes Viral - Sakshi

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్‌డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్‌ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన  71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్‌ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్‌ అవుతున్న ఫ్యాన్స్‌

మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్‌ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఇవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్‌డే సందర్భంగా మనోజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్‌ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్‌ మీడియా వేదికగా మోహన్‌ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 

చదవండి: షాకింగ్‌: లాకర్‌లోని రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement