మౌనిక (ఫైల్)
బెజ్జంకి(సిద్దిపేట): కులాంతర వివాహం చేసుకుందని చెల్లెలిపై ఓ అన్న కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన చిట్టం పెల్లి మౌనిక 12 రోజుల క్రితం మండలంలోని తోటపల్లికి చెందిన తన డిగ్రీ క్లాస్‌మేట్ సొల్లు సాయిని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది.
ఆపై తమకు రక్షణ కల్పించాలని ఆ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ కోసం శనివారం బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌కు రావల్సిన మౌనికతో సోదరుడు నాగరాజు ఘర్షణ పడ్డాడు. పరువు తీస్తున్నావంటూ కత్తితో దాడికి పాల్పడటంతో ఆమె వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం నాగరాజు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మౌనికను తాతయ్య, స్థానికులు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment