
యువతి దారుణ హత్య
బోధన్ టౌన్ : బోధన్ పట్టణ శివారులోని పాండు చెరువు కట్టమీద సోమవారం రాత్రి 19 ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హ్యత చేశారు. మంగళవారం ఉదయం కట్టమీదికి వెళ్లిన రైతులకు యువతి మృదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రామకృష్ణ, ఎస్సై గంగాధర్‌లు మృతదేహాన్ని పరిశీలించారు. చెట్ల పొదల్లో పడిఉన్న మృత దేహం ముఖం గుర్తు పట్టకుండా అయ్యింది. పోలీసులు డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించారు.
పోలీసు జాగి లం అక్కడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ చివరకు మృత దేహం వద్దకు వచ్చి నిలిచింది. కాగా మృతురాలిని వర్ని మండలం రుద్రూర్ గ్రామానికి చెందిన మౌని కగా గుర్తించారు. హతురాలు బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేదని, సోమవారం ఉదయం డ్యూటికి వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. హతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
బంధువులు రాస్తారోకో...
మౌనిక హత్య కేసులో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆమె బంధువులు ఏరియా ఆస్పత్రి ముందు రాస్తారోకో నిర్వహిం చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు.