
సాక్షి, హైదరాబాద్: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి ఎస్. మౌనిక రాణించింది. తిరువనంతపురంలోని వట్టియూరుక్కవు షూటింగ్ రేంజ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రజత పతకాన్ని గెలుచుకుంది. బుధవారం జరిగిన జూనియర్ మహిళల 50 మీటర్ల ప్రోన్ ఈవెంట్‌లో మౌనిక 610.5 పాయింట్లు స్కోరు చేసి రన్నరప్‌గా నిలిచింది.