Surya Web Series Actress Mounika Reddy Getting Marriage - Sakshi
Sakshi News home page

Mounika Reddy: పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘సూర్య’ వెబ్‌ సిరీస్‌ నటి, వరుడు ఎవరంటే..!

Published Thu, Dec 8 2022 3:27 PM | Last Updated on Thu, Dec 8 2022 7:36 PM

Surya Web Series Actress Mounika Reddy Getting Marriage - Sakshi

షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మౌనిక రెడ్డి. షణ్ముఖ్‌ జశ్వంత్‌ ‘సూర్య’ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా చేసి రాత్రిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ చిత్రంలో నటించే చాన్స్‌ కొట్టేసింది. ఈ చిత్రం ఆమె లేడీ కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.  ఇక రీసెంట్ గా వచ్చిన ‘ఓరి దేవుడా!’ సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. ఓ వైపు వెండితెరపై నటింగా, మరో వైఫు షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది మౌనిక రెడ్డి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది. తన ప్రియుడు సందీప్‌ అనే వ్యక్తితో ఏడడుగులు వేయబోతోంది.

చదవండి: నటిగా ఎంట్రీ ఇస్తున్న సింగర్‌ సునీత! ఆ స్టార్‌ హీరోకి అక్కగా?

ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. అంతేకాదు తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. అంతేకాదు పెళ్లి తేదీ కూడా ప్రకటించింది. డిసెంబర్‌ 17,18 తేదీల్లో గోవాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగునున్నట్లు మౌనిక తెలిపింది. కాగా మొదట స్నేహితులుగా పరిచమైన వీరద్దరు ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో మౌనికకు తన సహా నటీనటుల నుంచి ఫాలోవర్స్‌ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement