టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ఆయన పెళ్లాడారు. ఇటీవలే త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే మనోజ్ సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందు వరుసలో ఉంటారు. అనాథ ఆశ్రమాల విద్యార్థులకు సాయం చేస్తుంటారు.
తాజాగా మరోసారి మంచు మనోజ్ దంపతులు గొప్ప మనసును చాటుకున్నారు. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత తొలిసారిగా మనోజ్ దంపతులు అనాధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా దగ్గరుండి విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అన్నా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. మనోజ్ ప్రస్తుతం ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment