
మరికాసేపట్లో మంచు మనోజ్, భూమా మౌనిక వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ రోజు (మార్చి 3) రాత్రి 8.30 గంటలకు మంచు లక్ష్మి స్వగృహంలో వీరి పెళ్లి జరగనుంది. అయితే మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మి తన భుజాన వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమ్ముడి పెళ్లి దగ్గరుండి జరిపిస్తున్నందుకు లక్ష్మిని అభిమానులు కొనియాడుతున్నారు. కానీ ఏదైనా ఫంక్షన్ హాల్‌లోనో మరింకెక్కడోనో పెళ్లి జరిపించకుడా లక్ష్మి ఇంట్లో ఎందుకు ఈ తంతు నిర్వహిస్తున్నారన్న అనుమానాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
మంచు లక్ష్మికి మనోజ్ అంటే ప్రాణం. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. మనోజ్ అంటే చాలా ఇష్టమని, తనను కొడుకులా చూసుకుంటానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అంతేకాదు, మనోజ్‌కు అన్ని సందర్భాల్లో అండగా నిలిచింది. మనోజ్ పెళ్లి రూమర్స్ గురించి అడిగినప్పుడు కూడా వ్యక్తిగత విషయాలను ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతారని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా పెళ్లి ఘడియలు రావడంతో తనే పెళ్లిపెద్దగా మారింది. మనోజ్ తనకు ఎంతో క్లోజ్ కావడంతో పెళ్లి పనులు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది. ఇక భూమా మౌనిక విషయానికి వస్తే బీటెక్ పూర్తి చేసిన ఆమెకు విదేశాల్లో ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. కొంతకాలంగా మనోజ్‌తో ప్రేమలో ఉన్న ఆమె ఎట్టకేలకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment