న్యూఢిల్లీ: అన్నీ కలిసొస్తే ఈపాటికి టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్ క్రీడా పోటీల్లో రెజ్లర్ సుశీల్‌కుమార్ ఉండేవాడు. కానీ ఓ హత్య కేసు విషయంలో అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైలులో కాలం వెళ్లదీస్తున్నాడు. రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ తాను ఒలంపిక్స్ క్రీడలు చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుడు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతడికి టీవీ కేటాయించారు. మే 23వ తేదీన ఓ వివాదం విషయంలో యువ రెజ్లర్ సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లు పరారీలో ఉన్న సుశీల్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment